Where are India's top scientists located - Do you know their monthly salary?

Where are India's top scientists located - Do you know their monthly salary?

భారత టాప్ సైంటిస్ట్స్ ఉన్న ప్రదేశం ఎక్కడుంది - వారి నెల జీతం ఎంతో తెలుసా?

Where are India's top scientists located - Do you know their monthly salary?

ఇంతకుముందు ఎన్నడూ చూడని చంద్రుని దక్షిణ భాగంలో చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్  అయినప్పటి నుండి ప్రస్తుత సోలార్ ప్రోబ్ ఆదిత్య ఎల్-1 వరకు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ఈ విజయాల వెనుక ఉద్వేగభరితమైన ఇంకా  నిబద్ధత కలిగిన శాస్త్రవేత్తలు, స్కాలర్స్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే  ఈ శాస్త్రవేత్తలకు ఎంత జీతం వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?

ఇస్రో సైంటిస్ట్ లేదా ఇంజనీర్ దాదాపు రూ. 84,360 జీతం పొందుతారు. ఈ వేతనాన్ని 7వ పే గ్రూప్ ప్రకారం అదనపు పెర్క్విసిట్‌లు ఇంకా బోనస్‌లతో పొందుతారు. మొత్తం వేతనాలతో సహా ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల  జీతంగురించి వివరంగా చేస్తే...

ఇస్రో శాస్త్రవేత్తలు అండ్  ఇంజనీర్ల వేతన స్కేలు వారి పోస్ట్ తో ముడిపడి ఉంటుంది. కనుక  ఇస్రోలో వారి ప్రత్యేక పాత్ర ఇంకా  బాధ్యతలను బట్టి మారవచ్చు. 7వ పే కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగుల ప్రాథమిక వేతనం  రూ. 56,100. అలాగే  భారత టాప్  సైంటిస్ట్స్ ఉన్న ప్రదేశం కూడా ఇస్రో. 

ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (SC) ప్రారంభ వేతనం రూ. 84, 360. ఇందులో ట్రావెల్  అలవెన్సులు, ఇంటి రెంట్  అలవెన్సులు(HRA), ఇంకా  డియర్నెస్ బెనిఫిట్స్ వంటి వివిధ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి, ఇస్రో శాస్త్రవేత్తలకు మొత్తం జీతం రూ.84,000. కటింగ్స్  తర్వాత నెట్  సాలరీ రూ.72,360.

మొత్తంగా ఒక ఇస్రో శాస్త్రవేత్త   ప్రాథమిక వేతనంగా  చేతికి దాదాపు రూ.70,000 పొందుతాడు. అదేవిధంగా, ఇస్రో  అధికారిక వెబ్‌సైట్ isro.gov.inలో సైంటిస్ట్  అండ్ ఇంజనీర్ పోస్టులకు 65 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.