Do you know which are the most viewed live videos on YouTube? Millions of views.. top place than anything..

Do you know which are the most viewed live videos on YouTube? Millions of views.. top place than anything..

యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన లైవ్ వీడియోస్ ఏవో తెలుసా..? లక్షల్లో వ్యూస్.. టాప్ ప్లేస్ దేనికంటే..

Do you know which are the most viewed live videos on YouTube? Millions of views.. top place than anything..
చంద్రయాన్-3, యాపిల్ ఈవెంట్, బ్రెజిల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు యూట్యూబ్‌లో అత్యధికంగా చుసిన  లైవ్  టెలికాస్ట్ లో ఉన్నాయి. వాటిలో టాప్ 10 ర్యాంక్ ఈవెంట్స్ ఏవంటే.. ? 
ఆగస్టు 23న, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ జరిగింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం భారతదేశం. యునైటెడ్ స్టేట్స్, చైనా ఇంకా  రష్యా (గతంలో సోవియట్ యూనియన్) తర్వాత చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన నాల్గవ దేశం ఇండియా. 
ప్రపంచ గణాంకాల నివేదిక ప్రకారం, చంద్రయాన్-3  ప్రత్యక్ష ప్రసారం YouTubeలో అత్యధికంగా చుసిన  లైవ్ బ్రాడ్ కాస్ట్. ఆగష్టు 23న ISRO  చంద్రయాన్-3 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారంకి 8.06 మంది ఒకేసారి వ్యువర్స్ ఉన్నారు, అయితే స్పెస్ క్రాఫ్ట్ చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగింది, భారతదేశం ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాల్గవ దేశంగా ఇంకా దక్షిణం వైపున సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. 
CazéTV's   బ్రెజిల్ vs దక్షిణ కొరియా FIFA మ్యాచ్  6 డిసెంబర్  2022న ప్రసారం చేయబడిన సమయంలో 6.15 మిలియన్ల మంది లైవ్  వ్యువర్స్ తో YouTubeలో అత్యధికంగా వీక్షించబడిన రెండవ లైవ్  బ్రాడ్ కాస్ట్. 
YouTubeలో అత్యధికంగా వీక్షించబడిన మూడవ లైవ్ స్ట్రీమ్  CazéTV's  బ్రెజిల్ vs క్రొయేషియా సాకర్ మ్యాచ్. డిసెంబర్ 9, 2022న ఖతార్‌లో జరిగిన FIFA 2022 ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్ కోసం సుమారు 5.2 మిలియన్ల మంది వ్యువర్స్ ఉన్నారు. ఖతార్‌లోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో ఈ టోర్నీ జరిగింది. 
మార్చి 20, 2023న బ్రెజిలియన్ కాంపియోనాటో కారియోకాలో జరిగిన వాస్కో vs ఫ్లెమెంగో సెమీ-ఫైనల్   లైవ్ స్ట్రీమ్  సమయంలో 4.8 మిలియన్ల వ్యువర్స్  అందుకుంది. ఈ మ్యాచ్  యూట్యూబ్‌లో  లైవ్ స్ట్రీమ్ లో నాల్గవ స్థానంలో ఉంది  . 
SpaceX  మే 27, 2020 క్రూ డెమో   లైవ్ బ్రాడ్ కాస్ట్ 4.08 మిలియన్ల వ్యువర్స్ ని ఆకర్షించింది. NASA ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంకా  దాని నుండి కార్యాచరణ సిబ్బంది మిషన్‌ల కోసం SpaceX  మానవ అంతరిక్ష విమాన వ్యవస్థకు డెమో-2 ఒక కీలక పరీక్ష. 
పాపులర్  దక్షిణ కొరియా బ్యాండ్ BTS   సింగిల్ బటర్స్ మ్యూజిక్ వీడియో 3.75 మిలియన్ల లైవ్  వ్యువర్స్ తో  YouTubeలో అత్యధికంగా లైవ్  స్ట్రీమ్ చేయబడిన వీడియోలలో ఆరవ స్థానంలో ఉంది. మే 21, 2021న ఈ  లైవ్  బ్రాడ్ కాస్ట్   చేయబడింది. 
ఆపిల్  వాచ్ సిరీస్ 8, ఆపిల్  వాచ్ SE, ఆపిల్  వాచ్ Ultra, AirPods Pro, ఐఫోన్  14 సిరీస్ ఆపిల్  ప్రత్యక్ష ప్రసారం సెప్టెంబర్ 7, 2022న YouTubeలో 3.69 మిలియన్ల వ్యువర్స్ తో అత్యధికంగా వీక్షించబడిన ప్రత్యక్ష ప్రసారాలలో ఏడవది. 
జూన్ 1 2022న, లా & క్రైమ్ నెట్‌వర్క్  జానీ డెప్ vs అంబర్ హర్డ్ లైవ్ స్ట్రీమ్ 3.55 మిలియన్ల వ్యువర్స్ అందుకుంది. అత్యధికంగా వీక్షించబడిన YouTube ప్రత్యక్ష ప్రసారాలలో ఈ వీడియో  ఎనిమిదో స్థానంలో ఉంది.
జూలై 9, 2023న   ఫ్లూమినెన్స్ ఫుట్‌బాల్ క్లబ్ ద్వారా ఫ్లూమినెన్స్ vs  ఫ్లెమెంగో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన లైవ్ స్ట్రీమ్‌లలో తొమ్మిదవది, ఈ వీడియోకి 3.53 మిలియన్ల మంది లైవ్ వ్యువర్స్  ఉన్నారు.

జూలై 12, 2020న ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఫ్లూమినెన్స్ ఫుట్‌బాల్ క్లబ్ క్యారికో చాంప్ 3.25 మిలియన్ల వ్యువర్స్  సంపాదించుకుంది, వీడియో స్ట్రీమింగ్ సైట్‌లో అత్యధికంగా వీక్షించబడిన లైవ్ స్ట్రీమ్‌లో ఈ వీడియో పదవ స్థానంలో నిలిచింది.
Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.