No more SBI account required to use Yono app; Here are the ways-sak

 No more SBI account required to use Yono app; Here are the ways-sak

యాప్‌ను ఉపయోగించడానికి ఇకపై బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు; ఎలానో ఇక్కడ తెలుసుకోండి..

No more SBI account required to use Yono app; Here are the ways-sak

యోనో యాప్‌ను SBI భారీగా మార్చేసింది. Yono కొత్త వెర్షన్‌లో వినియోగదారులు పేమెంట్ చేయడానికి స్కాన్ చేయడం, కాంటాక్ట్స్  ద్వారా పేమెంట్  ఇంకా మని రిక్వెస్ట్  వంటి UPI ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందుతారు. ఎస్‌బీఐ కొత్త పాలసీ పేరు 'యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్'. 

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్ యోనోను ఉపయోగించడానికి మీకు ఇకపై SBI అకౌంట్ అవసరం లేదని  తెలిపింది. ఇంతకుముందు ఎస్‌బీఐ ఖాతాదారులు మాత్రమే యోనో యాప్‌ను ఉపయోగించుకునేవారు. ఇప్పుడు YONO   పరిధిని పెంచే ప్రయత్నాలలో భాగంగా UPI పేమెంట్స్ కోసం YONO యాప్‌ని ఉపయోగించడానికి SBI ఇటీవల ఇతర బ్యాంక్ కస్టమర్లను  అనుమతించింది. 

అంతేకాదు, యోనో యాప్‌ను SBI భారీగా మార్చేసింది. Yono కొత్త వెర్షన్‌లో వినియోగదారులు పేమెంట్ చేయడానికి స్కాన్ చేయడం, కాంటాక్ట్స్  ద్వారా పేమెంట్  ఇంకా మని రిక్వెస్ట్  వంటి UPI ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందుతారు. ఎస్‌బీఐ కొత్త పాలసీ పేరు 'యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్'. 

 SBI Yonoని ఎలా ఉపయోగించాలి

*SBI Yono మొబైల్ బ్యాంకింగ్ యాప్ Google Play Store ఇంకా  iPhone App Storeలో అందుబాటులో ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, 'న్యూ టు ఎస్‌బీఐ' అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద 'రిజిస్టర్ నౌ' అనే ఆప్షన్ చూస్తారు. SBI ఖాతాదారులు కానివారు 'రిజిస్టర్ నౌ'పై క్లిక్ చేయవచ్చు.

*రిజిస్టర్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్ తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో లింక్ చేసి ఉండేలా చూసుకోండి. 

*నెక్స్ట్  మీ ఫోన్ నంబర్‌ని వెరిఫై చేయడానికి మీరు మీ బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేసిన SIMని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న  మొబైల్ నంబర్ నుండి SMS పంపబడుతుంది. 

*మీ నంబర్ వెరిఫై చేసిన తర్వాత, UPI IDని రూపొందించడానికి మీ బ్యాంక్ పేరును ఎంటర్  చేయండి. 

*ఇప్పుడు మీకు SBI పే కోసం మీ రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని మెసేజ్ వస్తుంది. 

*మీ స్క్రీన్ పైభాగంలో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు, మీరు SBI UPIని క్రియేట్  చేయాలి. SBI మీకు మూడు UPI ID అప్షన్స్  అందిస్తుంది, వాటిలో మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

*మీరు UPI IDని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, "మీరు SBI UPI  సక్సెస్ ఫుల్ గా క్రియేట్ చేసినట్లు  ప్రస్తావిస్తూ మీకు మెసేజ్  వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న UPIని మీరు స్క్రీన్‌పై చూస్తారు.

*మీ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఇంకా పేమెంట్ ప్రారంభించడానికి మీరు పిన్‌ని సెటప్ చేయాలి. ఇందులో ఆరు అంకెలు ఉండాలి. 

*పిన్‌ని సెటప్ చేసిన తర్వాత, మీరు UPI పేమెంట్స్ చేయడానికి Yono యాప్‌ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.