Internet for children only one hour a day, Mobile is a huge danger, this country has made a decision-sak

 Internet for children only one hour a day, Mobile is a huge danger, this country has made a decision-sak

రోజుకు ఒక గంట మాత్రమే ఇంటర్నెట్..; ఈ దేశం కీలక నిర్ణయం.. 14 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం..

Internet for children only one hour a day, Mobile is a huge danger, this country has made a decision-sak

ఎనిమిదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు రోజుకు ఒక గంట మాత్రమే ఇంటర్నెట్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కేవలం 40 నిమిషాల స్మార్ట్‌ఫోన్ వినియోగానికి అనుమతిస్తారు. 

బీజింగ్: చిన్నారుల్లో మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది. మొబైల్ ఫోన్ల వల్ల పెద్ద ప్రమాదమని, పిల్లల్లో మొబైల్ వాడకం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని గ్రహించిన చైనా.. దిద్దుబాటు చర్యలకు ముందుకు వచ్చింది. ఎనిమిదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు రోజుకు ఒక గంట మాత్రమే ఇంటర్నెట్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కేవలం 40 నిమిషాల స్మార్ట్‌ఫోన్ వినియోగానికి అనుమతించనుంది. 

16 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి రోజుకు రెండు గంటలు అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పిల్లల ఫోన్లలో మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించకూడదని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 2 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చైనా దేశం నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లలో 'మైనర్ మోడ్'ని ప్రవేశపెట్టాలని మొబైల్ ఫోన్ తయారీదారులను కూడా  ప్రభుత్వం కోరింది. 

18 ఏళ్లలోపు పిల్లలు వీడియో గేమ్‌లు ఆడే సమయాన్ని వారానికి మూడు గంటల కంటే తక్కువకు పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. చైనా పిల్లల కోసం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా సైట్‌లపై కూడా పరిమితులను అమలు చేసింది, వీటిలో  40 నిమిషాల డైలీ లిమిట్ ఇంకా  14 ఏళ్లలోపు వినియోగదారులపై నిషేధం ఉన్నాయి.  

ఈ ఏడాది ప్రారంభంలో, గ్వాంగ్జీలో 13 ఏళ్ల బాలుడు తన తండ్రిని కొడవలితో నరికివేస్తానని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యం ఫోనులో ఆడుకుంటున్న కొడుకు నుంచి మొబైల్ తీసుకోగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది పెద్ద చర్చకు దారి తీసింది. చైనా అభివృద్ధికి యువతే కీలకమని జిన్‌పింగ్ ప్రభుత్వం పదే పదే చెప్పడంతో కొత్త నిబంధన వచ్చింది. ఈ నిర్ణయం తర్వాత ప్రపంచ మార్కెట్‌లో పలు చైనా కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.