Do you know the salary of Apple store employees? How much do you earn here hourly?

 Do you know the salary of Apple store employees? How much do you earn here hourly?

ఆపిల్ స్టోర్ ఉద్యోగులకి జీతం ఎంతో తెలుసా..? ఇక్కడ గంట లెక్కన ఎంత సంపాదిస్తారంటే..?

Do you know the salary of Apple store employees? How much do you earn here hourly?

ఆపిల స్టోర్ ఉద్యోగులకు గంటకు దాదాపు రూ.1,825 నుంచి రూ.2,490 జీతం ఇస్తున్నట్లు సమాచారం.అలాగే  రిటైల్ ఉద్యోగుల అన్యువల్ వేతన పెంపును కంపెనీ తగ్గించిందని ఒక నివేదిక పేర్కొంది. అంటే అంతకుముందు సంవత్సరాల్లో ఇచ్చిన అధిక వేతనాల పెంపులో మార్పు వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఆపిల్ ప్రస్తుత సంవత్సరానికి దాదాపు నాలుగు శాతం "ఆవరేజ్  అన్యువల్  గ్రోత్"ని రిజిస్టర్ చేసింది. గతేడాది జీతాలు 8% నుంచి 10% మధ్య పెరిగాయి. కానీ ఈ సంవత్సరం ఆలా కాకుండా 2023లో పెరుగుదల రెండు శాతం నుండి ఎక్కువగా  ఐదు శాతానికి పరిమితం చేయబడింది. 

Apple ఇండియన్ స్టోర్ ఉద్యోగులకు సంబంధించిన జీతం గణాంకాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. యునైటెడ్ స్టేట్స్‌లోని సాధారణ ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా కంపెనీ జీతాల పెరుగుదలను అమలు చేసిందని అంచనా. USలోని దాదాపు అందరు Apple సేల్స్ ఉద్యోగులకు గంటకు $22 (సుమారు రూ. 1,825) నుండి  $30 (సుమారు రూ. 2,490) మధ్య వేతనం లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. 

కానీ AppleCare ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం లభిస్తుంది. అదనంగా, Apple ప్రతి సంవత్సరం రెండు వర్గాల ఉద్యోగులకు కూడా లిమిటెడ్  చేయబడిన స్టాక్ యూనిట్లను మంజూరు చేస్తుంది. ఇంకా  మంచి సంఖ్యలో ఉద్యోగులు కూడా అదనపు బోనస్ పొందుతారు.

లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ తాజాగా మొదటిసారిగా సేల్స్ కి వచ్చింది. భారతదేశంలోని ఆపిల్ అభిమానులు వారికీ ఇష్టమైన ఫోన్‌ను తీసుకునేందుకు టెక్ కంపెనీ ముంబై అండ్ ఢిల్లీ స్టోర్‌ల ముందు పోటెత్తారు.

బేసిక్  128GB iPhone 15 ధర రూ.79,900 అండ్  256GB మోడల్ ధర రూ.89,900. 512GB మోడల్ ధర రూ.1,09,900 కాగా, 128GB ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900 ఇంకా 256GB వేరియంట్ ధర రూ.99,900. ఇందులో  512 GB మోడల్ కూడా ఉంది. దీని ధర రూ. 1,19,900. iPhone 15 Pro 128GB మోడల్‌ ధర రూ. 1,34,900, 256GB వేరియంట్ ధర రూ. 1,44,900. 

కస్టమర్లు  512GB మోడల్‌ను రూ. 1,64,900కి, 1TB వేరియంట్‌ను రూ. 1,84,900కి కొనుగోలు చేయవచ్చు. Apple   ప్రీమియం iPhone, iPhone 15 Pro Max, ప్రస్తుతం 256GB మోడల్ ధర రూ.1,59,900. 512 GB వేరియంట్‌  రూ.1,79,900, 1 TB మోడల్‌కు రూ. 1,99,900.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.