A new video editing app with AI features! YouTube introduced with amazing features..

 A new video editing app with AI features! YouTube introduced with amazing features..

ఏఐ ఫీచర్లతో కొత్త వీడియో ఎడిటింగ్ యాప్! అద్భుతమైన ఫీచర్లతో పరిచయం చేసిన యూట్యూబ్..

A new video editing app with AI features! YouTube introduced with amazing features..

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ వీడియోలను రూపొందించడానికి యూట్యూబ్ క్రియేట్ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను ప్రకటించింది. గురువారం జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.

"వీడియోల కోసం ప్రొడక్షన్ ప్రక్రియ కష్టంగా ఉంటుందని మాకు తెలుసు, మేము వీడియోలను రూపొందించడానికి YouTube క్రియేట్ అనే కొత్త మొబైల్ యాప్‌ని పరిచయం చేస్తున్నాము." అని YouTube పేర్కొంది. 

ఇండియా, యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, యుకె, ఇండోనేషియా, కొరియా అండ్  సింగపూర్‌తో సహా సెలెక్ట్ చేసిన దేశాలలో మాత్రమే Androidలో ప్లే స్టోర్‌లో బీటా యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులో ఉంది.  2024లో ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

YouTube క్రియేట్ షార్ట్  అండ్  లాంగ్ వీడియోల కోసం వీడియో ఎడిటింగ్‌ని ఈజీ చేయడానికి రూపొందించబడింది. ఈ యాప్ ఎటువంటి ఛార్జీలు లేని ఫ్రీ  యాప్. కానీ క్రియేటర్లు  ఈ సదుపాయాన్ని క్రియేటివిటీ కోసం ఉపయోగించాలి అని సూచించింది. 

కొత్త YouTube క్రియేట్ AI యాప్‌లో  ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ టైటిల్, వాయిస్ అండ్  ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. టిక్‌టాక్  లాగే   రాయల్టీ-ఫ్రీ మ్యూజిక్ అప్షన్ అందిస్తుంది.

కొత్త యాప్‌ను రూపొందించడానికి దాదాపు 3,000 మంది క్రియేటర్‌ల నుండి అభిప్రాయాన్ని సేకరించినట్లు YouTube తెలిపింది. YouTube కూడా ఫ్యూచర్లో క్రియేట్ యాప్‌కి కొత్త ఫీచర్‌లను తీసుకొస్తామని హామీ ఇచ్చింది.

మీరు డ్రీమ్ స్క్రీన్ అనే కొత్త ఫీచర్‌ని ఉపయోగించి వీడియోల బ్యాక్ గ్రౌండ్  సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోను పేర్కొనడం వలన కృత్రిమ మేధస్సు టెక్నాలజీ  వీడియో లేదా ఫోటోకి  తగిన బ్యాక్ గ్రౌండ్  అందిస్తుంది.

మరిన్ని వైడ్ ఫీచర్లతో వచ్చే ఏడాది యూట్యూబ్ క్రియేట్ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. Google CEO సుందర్ పిచాయ్ ట్విట్టర్‌ ఒక పోస్ట్‌లో కొత్త డ్రీమ్ స్క్రీన్ ఫీచర్‌ గురించి  కూడా ప్రకటించారు, "వీడియో ప్రొడక్షన్  మరింత ఈజీ  చేయడానికి క్రియేటర్లు YouTube క్రియేట్ యాప్‌ని ఉపయోగించవచ్చు" అని ట్వీట్ చేసారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.