WEATHER UPDATE TODAY: Cold intensity has reached dangerous level .. IMD warns that there will also be rains
Weather Update Today: ప్రమాదకర స్థాయికి చేరిన చలి తీవ్రత .. వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ వార్నింగ
Weather Forecast: ఉత్తర భారత రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. చలి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
Weather Update Today: భారత్ ను చలి, వర్షాలు భయపెడుతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరాధి రాష్ట్రాలన్నింటిలో చలిగాలులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు ప్రజలను అస్వస్థతకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్‌లలో ఈరోజు, రేపు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. యుపి-బీహార్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో చలి తీవ్రత మరింత భయపెడుతోంది.
ఉదయం వేళల్లో రోడ్ల మీదకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిబిలిటీ సరిగా లేక ప్రమాదాల బారినపడుతున్నారు.ఆ తర్వాత 2-3 రోజులు చలి తీవ్రతలో తేడా ఉండదని వాతావరణ కేంద్రం తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎండలు కూడా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్యప్రదేశ్, అస్సాం, త్రిపుర ,ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. హైవే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెల్సియస్‌తో ముగిసింది. గత ఐదు రోజులుగా ఢిల్లీ వాతావరణం చలి రికార్డును లిఖిస్తోంది. ఉష్ణోగ్రత నిరంతరం పడిపోతుంది.
ఉత్తరాది రాష్ట్రాలు చాలా వరకు సూర్యుని ప్రకాశాన్ని చూడవు. విపరీతమైన చలి మరియు దట్టమైన పొగమంచు రైలు ట్రాఫిక్ మరియు విమాన ప్రయాణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
దక్షిణాదిలో వాతావరణం చల్లబడగా, ఉదయం 10 గంటల తర్వాత ఎండ వేడిమిని ఇస్తోంది. సాయంత్రం వేళ చలితో గాలివాన వీస్తోంది. ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.