Pencil Art: Ayodhya Ram Mandir picture with pencil... You have to say Aura when you see it

Pencil Art: Ayodhya Ram Mandir picture with pencil... You have to say Aura when you see it

Pencil Art: పెన్సిల్‌తో అయోధ్య రామ మందిర చిత్రం... చూస్తే ఔరా అనాల్సిందే

Pencil Art: Ayodhya Ram Mandir picture with pencil... You have to say Aura when you see it

ఓ యువకుడు పెన్సిల్ సాయంతో అయోధ్య రామ మందిర చిత్రాన్ని గీసి అబ్బురపరుస్తున్నాడు. అతని టాలెంట్ మీరూ చూడండి.

ప్రస్తుతం దేశమంతా ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) పైనే చర్చ జరుగుతోంది. శ్రీరామ భక్తులు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూల్‌కు చెందిన ఓ యువకుడు పెన్సిల్‌తో గీసిన అయోధ్య రామ మందిర చిత్రం అద్భుతంగా ఉంది. చూస్తే ఔరా అనాల్సిందే.

కర్నూల్ పట్టణంలోని నారాయణ గుంత ప్రాంతానికి చెందిన లక్ష్మి, పద్మనాభాచార్యుల దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో పెద్దకుమారుడైన శ్రీకాంత్ తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే చిత్రాలు గీయడంపై దృష్టి సారించారు. అలా మొదలై నేటికి 3 వేలకు పైగా చిత్రాలు గీశారు. ఎలాంటి కలర్లు, స్కెచ్ పెన్నులు వాడకుండా కేవలం ఒక పెన్సిల్ తోనే చిత్రాలు గీయడం ఇతని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

అతను కుంచెపట్టి తెల్ల కాగితంపై బొమ్మ గిశాడంటే ఆ బొమ్మకు ప్రాణం ఉట్టిపడేలా సత్తా అతనిది. ఈ చిత్రాలన్నీ ఇతను కేవలం ఒక పెన్సిల్, పెన్ను, ఒక తెల్లటి కాగితం ద్వారానే ఎన్నో కళాత్మక చిత్రాలు గీయడం ఈయనలో ఉన్న ప్రత్యేకత. ఇతను గిసిన చిత్రాలలో పేపర్ కాల్చిన తరువాత వచ్చిన బూడిదతో, చేతితో గిసిన మహాత్మా గాంధీ చిత్రానికి ఏకంగా ఇండియన్ బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కిందంటే అతను గిసిన చిత్రాలు మన కళ్ళను అంతలా మైమరపిస్తాయి.

ఇందులో భాగంగానే ప్రస్తుతం అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని కేవలం పెన్సిల్ తో 1:30 గంటల సమయంలో అద్భుతంగా గీసి ఔరా అనిపించారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి నోటా అయోధ్య రామ అనే పేరు మారుమ్రోగుతుంది. అలాంటి సమయంలో తన కంటూ ఒక ప్రత్యేకత ఏర్పారుచుకునేలా కేవలం పెన్సిల్ సహాయంతో చక్కగా అయోధ్య రామ మందిరాన్ని గీశారు. ఇతను గిసిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

కాగా అయోధ్యలో నేటి నుంచి ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా 17న ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశిస్తుంది. 18వ తేదీన తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్, ఆ మర్నాడు 19వ తేదీన ఔషధ దివాస్, కేసరదివాస్, గ్రిత దివాస్, ధాన్య దివాస్ పేరుతో పూజలు ఉంటాయి. 20వ తేదీన షర్కారదివాస్, ఫలదివాస్, పుష్పదివాస్, 21వ తేదీన మధ్యదివాస్, శయ్య దివాస్ కార్యక్రమాలు 22న ముఖ్యమైన ఘట్టం ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.