ViewSonic Projectors: The first projector with Xbox support..What are the features?!

ViewSonic Projectors: The first projector with Xbox support..What are the features?!

ViewSonic Projectors: Xbox సపోర్ట్ తో వచ్చిన మొదటి ప్రొజెక్టర్..ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

ViewSonic Projectors: The first projector with Xbox support..What are the features?!

HIGHLIGHTS

ViewSonic ఇండియాలో కొత్త ప్రొజెక్టర్ లను విడుదల చేసింది

X1-4K మరియు X2-4K LED మోడల్ నెంబర్ లతో తీసుకు వచ్చింది

ఈ కొత్త ప్రొజెక్టర్స్ Xbox కోసం డిజైన్ చేయబడిన ప్రపంచంలోనే మొదటి ప్రొజెక్టర్

ప్రముఖ ప్రొజెక్టర్ తయారీదారు ViewSonic ఇండియాలో కొత్త ప్రొజెక్టర్ లను విడుదల చేసింది. X1-4K మరియు X2-4K LED మోడల్ నెంబర్ లతో తీసుకు వచ్చింది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ ఎక్కువ కాలం మన్నగల మరియు క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ ను అందించ గల సత్తా కలిగి ఉన్నట్లు వ్యూసోనిక్ తెలిపింది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ Xbox కోసం డిజైన్ చేయబడిన ప్రపంచంలోనే మొదటి ప్రొజెక్టర్ అవుతుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

వ్యూసోనిక్ తీసుకు వచ్చిన ఈ కొత్త ప్రొజెక్టర్స్, 1440p 120Hz రిఫ్రెష్ రేట్ తో డిటైల్డ్ మరియు లీనమయ్యే Xbox గేమింగ్ ను కోరుకునే గేమర్స్ కు తగిన విధంగా తీసుకు వచ్చింది. ఈ ప్రొజెక్టర్స్ అద్భుతమైన వివరాలతో కూడిన విజువల్స్ ను 100 ఇంచ్ సైజులో అందిస్తాయి. X1-4K మరియు X2-4K రెండు ప్రొజెక్టర్స్ కూడా 4K UHD విజువల్స్ ను లార్జ్ స్క్రీన్ పైన అందిస్తాయి.

ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా Xbox-exclusive రిజల్యూషన్ మరియు రిఫ్రెష్ రేట్ సమ్మిళిత సపోర్ట్ లను అందిస్తాయి. అంటే, 4.2ms Ultra-Fast Input మరియు 240Hz రిఫ్రెష్ రేట్ తో అద్భుతమైన గేమ్ ప్లే అనుభూతిని అందిస్తాయి. ఈ ప్రొజెక్టర్స్ 2,900 Lumens బ్రైట్నెస్ తో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ ను అందిస్తాయి మరియు 30,000 గంటల లైఫ్ స్పెన్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రొజెక్టర్స్ లో అందించిన Harman Kardon స్పీకర్స్ తో మంచి సౌండ్ ను కూడా ఆస్వాదించవచ్చు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.