Internet 'slow' on phone? If you try these 5 tricks, your net speed will increase
ఫోన్‌లో ఇంటర్నెట్ 'స్లో'గా ఉందా? ఈ 5 ట్రిక్స్ ట్రై చేస్తే నెట్ స్పీడ్ అదిరిపోతుంది
ఈ రోజుల్లో స్టార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు దాదాపు అన్ని పనులు అయిపోతున్నాయి. అయితే దీనంతటికి ఫోన్ లో ఇంటర్నెట్ వేగంగా పనిచేయడం చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో స్టార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు దాదాపు అన్ని పనులు అయిపోతున్నాయి. అయితే దీనంతటికి ఫోన్ లో ఇంటర్నెట్ వేగంగా పనిచేయడం చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు మన ఫోన్‌లలో ఇంటర్నెట్ వేగం నెమ్మదించడం మనం గమనిస్తూనే ఉంటాం. అటువంటి పరిస్థితిలో నెట్ వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉందో ఏమో అని అనుకొని మనం మంచి నెట్‌వర్క్ వచ్చే ప్లేస్ కి వెళ్లాలి అని అనుకుంటుంటాం. అయితే ఈ సమస్యకి పరిష్కారం అది కాదు. ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని వేగవంతం చేసే 5 చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం. వీటి ద్వారా మీ ఫోన్ లో ఎప్పుడైనా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే మీరు ఈజీగా దానిని పరిష్కరించవచ్చు.
ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి సులభమైన మార్గం ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం. ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా అన్ని ప్రోగ్రామ్‌లు రిఫ్రెష్ అవుతాయి, నెట్‌వర్క్ కనెక్షన్‌లో చిన్న సమస్యలు పరిష్కరించబడతాయి..ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది.
యాప్ అప్‌డేట్‌ల కారణంగా ఇంటర్నెట్ వేగం బాగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే, యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వాటిని అప్‌డేట్ చేయడంలో చాలా స్పీడ్ వృధా అవుతుంది..దీంతో మీ ప్రస్తుత పనిలో మీకు తక్కువ వేగం అనిపిస్తుంది.
మీరు ఆతురుతలో ఉంటే, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడానికి సమయం లేకపోతే..ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేసి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచి మళ్లీ ఆన్ చేయండి. ఇది మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేస్తుంది..మీ సమస్య కూడా పరిష్కరించబడే అవకాశం ఉంది.
ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యల్లో ఒకటి ఇంటర్నెట్ వేగం. ఎందుకంటే ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో అనేక రకాల బెటర్మెంట్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి, మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.
పైన తెలిపిన పద్ధతుల ద్వారా మీ సమస్య పరిష్కరించబడకపోతే..నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి రీసెట్ చేయండి. అయితే, అలా చేయడం వలన మీ సేవ్ చేయబడిన WiFi పాస్‌వర్డ్‌లు, జత చేసిన బ్లూటూత్ పరికరాలు తొలగించబడతాయని గుర్తుంచుకోండి.
పైన తెలిపిన పద్ధతులు మీ ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి. అయితే, దీని తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే, మీరు నిపుణుల నుండి సహాయం తీసుకోవాలి.

