(March 6)Valentina Tereshkova, the first woman to enter space in 1969, is born on March 6. About her...

 Valentina Tereshkova, the first woman to enter space in 1969, is born on March 6. About her...

1969 లో అంతరిక్షంలొ ప్రవేశించిన మొదటి మహిళ వాలెంతినా తెరిష్కోవా జన్మదినం మార్చి 6. ఆమెగురించి...

Valentina Tereshkova, the first woman to enter space in 1969, is born on March 6. About her...

ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.

మధ్య రష్యాలోని టుటయెవ్‌స్కీ జిల్లా లోని "మాస్‌లెన్నికోవో" అనే గ్రామంలో   ఒక ట్రాక్టర్ డ్రైవర్ కుమార్తె.ఆమె  తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేశేవారు. ఆమె 1945 లో తన 8 వయేట ప్రాఠాశాల విద్య ప్రారంభించారు కానీ 1953 లో పాఠశాలను వదిలి వేసి తర్వాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు.ఆమె యుక్త వయస్సు నుండి పరాచూట్ ల పట్ల ఆసక్తి కనబరచేవారు. అందువల్ల ఆమె స్కై డైవింగ్ లో స్థానిక ఏరో క్లబ్ లో శిక్షణ పొందారు. ఆమె తన 22 వ యేట అనగా మే 22, 1959 లో మొదటి సారి ఆకాశంలో డైవింగ్ చేశారు. ఆ కాలంలో ఆమె జౌళి పరిశ్రమలో ఒక ఉద్యోగినిగా పనిచేసే వారు. ఆమె ఆకాశ మార్గంలో డైవింగ్ చేయు నైపుణ్యం ఆమెను ఒక వ్యోమగామిగా ఎంపిక కాబడుటకు తోడ్పడింది. 1961 లో ఆమె స్థానిక 'కొమ్‌సొమోల్"(యువ కమ్యూనిస్ట్ లీగ్) నందు సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ నందు చేరారు.

1961 లో యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర తర్వాత సోవియట్ రాకెట్ ఇంజనీర్ అయిన "సెర్జీ కొరొల్‌ యోవ్"  ఒక మహిళను అంతరిక్షం లోకి పంపాలనే ఆలోచన చేశాడు. ఫిబ్రవరి 16, 1962 న వాలెంతినా తెరిషోవాను మహిళా వ్యోమ గాముల వర్గం లోకి ఎంపిక చేశాడు. అంతరిక్షం లోకి వెళ్ళుటకు దరఖాస్తుచేసిన 400 మందిలో ఐదు మంది మాత్రమే ఎంపిక కాబడ్డారు: 

టత్యాన కుజ్‌నెట్సోవా, 

ఇరినా సొలొవ్యోవ, 

ఝన్నా యొర్కినా, 

వలెంతినా పొనొ మార్యొవా  మరియు తెలిస్కోవా. 

తెలిస్కోవా ఎంపిక కాబడడానికి యోగ్యత ఆమె 30 సంవత్స రాలుగా పారాఛూట్ లో డైవింగ్ లో అనుభవం కలిగి యుండటం, 170 సెం.మీ. (5 అడుగుల 7అంగుళా లు)  ఎత్తు కలిగి ఉండటం మరియు 70 కి.గ్రా. ల బరువు కలిగి ఉండుట.

ఆమె భూమి యొక్క కక్ష్యలో 48 సార్లు తిరిగి మొత్తం మూడు రోజులు అంతరిక్షంలొ గడిపింది. ఆమె తన విమానంలో గడిపిన సమయం యిదివరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే ఎక్కువ. తెరిష్కోవా ప్లైట్ లో తన అనుభవాలను నమోదు చేయుతకు ఒక లాగ్ బుక్ నిర్వహించింది.ఆమె ఖగోళ విషయాలను ఫోటోలు కూడా తీసినది. ఆ చిత్రాలు తర్వాతి కాలంలో వాతావరణం లోని పొరలను కనుగొనుటలో ఉపయోగపడినవి.ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

తెరిస్కోవా ప్రయాణించిన వోస్టోవ్ 6 అనునది చివరి వోస్టోక్. ఇది వాలెరీ బైకోవ్‌స్కై అనే వ్యోమగామి ప్రయాణించిన వోస్టోక్ 5 బయలుదేరిన రెండు రోజుల తర్వాత బయలుదేరినది. ఇది వోస్టో 5 ప్రయాణించిన కక్ష్యలోనికే వెళ్ళినది. వోస్టోక్ 5 కక్ష్యలో ఐదు రోజులు అనగా తెరిష్కోవా వోస్టోక్ 6 నుండి దిగిన మూడు గంటల వరకు ఉంది. ఈ రెండు వ్యోమ నౌకలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందులో గల తెరిష్కోవా వైకోవ్‌స్కైతో సంభాషించింది. 

వీరిద్దరూ రేడియో ద్వారా ఖ్రుష్‌చెవ్ తో కూడా సంభాషించారు.

ఆతర్వాత అంతరిక్షంలోకి రెండవ మహిళను పంపే పథకం 19 సంవత్సరాల తర్వాత నెరవేరినది. తెరిష్కోవా తర్వాత 

స్వెత్లానా సవిక్షయ అనే మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టినది. ఆ తర్వాత తెరిష్కోవా బృందం లోని ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. 

అంతరిక్ష ప్రయాణం చేసిన తదుపరి తెరిష్కోవా జుకోవ్‌స్కై ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చదువుకొని అత్యధిక మార్కులతో అంతరిక్ష ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైనది. 1977 లో ఆమె ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందినది.

ఆమెకు వ్యోమగామిగా వచ్చిన ఔన్నత్యంతో అనేక రాకకీయ పార్టీలలో అనేక పదవులు లభించాయి. 1966 నుండి 1974 వరకు ఆమె "సుప్రీం సోవియట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్"లో సభ్యురాలిగా ఉన్నారు. 1974 నుండి 1989 వరకు "ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్"కు సభ్యులైనారు. 1969 నుండి 1991 వరకు ఆమె "సెంట్రల్ కమిటీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ"లో ఉన్నారు. 1977 లో ఆమె రష్యా ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ పొందారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వ్యోమగామిగా కూడా పదవీవిరమణ చేశారు.

సోవియట్ యూనియన్ లో రాజకీయ విభాగంలో ఆమెకు గల గుర్తింపుతో ఆమె సోవియట్ నుండి విదేశ ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆమె ప్రపంచ శాంతి కౌన్సిల్ కు మెంబర్ గా 1966 లో నియమింపబడ్డారు. 1967 లో ఆమె యారోస్లావ్ల్ సోవియట్ కు సభ్యులుగా ఉన్నారు.1966–1970 మరియు 1970–1974 లలో ఆమె సుప్రీం ఆఫ్ ద సోవియట్ యూనియన్ కు మెంబరుగా ఉన్నారు. ఆమె ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్ కు 1974 లో ఎన్నికైనారు.1975 లో మెక్సికో నగరంలో ఐక్యరాజ్యసమితి తరపున జరిగిన "అంతర్జాతీయ మహిళా సంవత్సరం "కు సోవియట్ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు.

ఆమె ప్రపంచ మహిళా సమావేశాలకు సోవియట్ యూనియన్ తరపున కోపెన్ హగ్ నగరంలో ముఖ్య భూమిక పోషించి శాతికోసం గ్లోబల్ అజెండాకు రూపకల్పన చేశారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.