Shabash Indian Army.. Soldiers who are farming there.. Do you know why?
శభాష్ ఇండియన్ ఆర్మీ.. అక్కడ వ్యవసాయం చేస్తున్న సైనికులు.. ఎందుకో తెలుసా?
Indian Army Day 2024: భారత్, చైనాల మధ్య శత్రుత్వం మనకు తెలిసిందే. ఈ దేశాల సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటుంది. అయితే ఈ రోజు మేము మీకు చెప్పబోతున్నది ప్రత్యేకమైన ఇండియా-చైనా సరిహద్దు గురించి, అక్కడ ఆర్మీ సైనికులు బాంబులు వెయ్యడం కంటే, వ్యవసాయం చేస్తున్నారు. అవును, DRDO సహాయంతో, భారతదేశం - చైనా సరిహద్దులో గ్రీన్‌హౌస్ నిర్మించారు. ఆ తర్వాత సైనికులు అక్కడ వ్యవసాయం చేస్తూ, కూరగాయలు పండిస్తున్నారు.
చైనా, భారత్‌కి పక్కలో బల్లెం లాంటిది. మన దేశ అభివృద్ధిని చూసి డ్రాగన్ తట్టుకోలేకపోతోంది. అందుకే ఇండియాని ఎలాగైనా దెబ్బతియ్యాలని సరిహద్దు ఆక్రమణలకు తెగిస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందువల్ల చైనా ఎప్పుడు ఏం చేస్తున్నా బలంగా ఖండించేందుకు సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీ నిరంతరం అలర్ట్‌గా ఉంటోంది.
హిమాలయ శిఖరాలపై నిర్మించిన, చైనా సరిహద్దుకు వెళ్లే రహదారులు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ పక్కనే ఉన్న చైనా సరిహద్దులో భారత సైనికులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం లేకపోవడం.
చైనా సరిహద్దుకు ఆహార పదార్థాలను డెలివరీ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, డబ్బాల్లో ఉన్న వస్తువులను మాత్రమే వారికి పంపిణీ చేసేవారు. వాటిని తినడం వల్ల సైనికుల ఆరోగ్యం చాలా చెడిపోయింది.
సైనికుల ఆరోగ్యాన్ని పరిశీలించిన తర్వాత, అందుకు డబ్బాలలో ఆహారమే కారణమని తేలింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, 2014లో, అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన DRDO ఒక ప్రత్యేక పరిష్కారాన్ని కనిపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, సలారీలలో గ్రీన్‌హౌస్‌లను ఏర్పాటు చేసింది.
గ్రీన్‌హౌస్‌ను నిర్మించిన తర్వాత సైనికులకు కూరగాయలు పండించడంలో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ సైనికులు తినడానికి, తాగడానికి వారి స్వంత కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. యువత ఈ పండ్లు, కూరగాయలను స్వయంగా పండిస్తారు. తరువాత వాటిని వినియోగిస్తారు.
ఈ జవాన్లు ఈ కూరగాయలు, పండ్లను స్వయంగా తినడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సరిహద్దు వ్యవసాయం ప్రజలను ఆకర్షించింది. ఇప్పుడు ఇక్కడ ఇది పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ సరిహద్దులో సైనికులు ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, బ్రకోలీతో పాటు దోసకాయలను కూడా పండిస్తున్నారు. ఇవి స్వయంగా పండించేవి, మంచి ఆహారం కావడంతో సైనికులకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటోంది. అతిగా పురుగుమందులు, రసాయనాలూ వాడకుండా.. ఈ పంటలను పండిస్తున్నారు.