(March 14)It is the birth anniversary of famous physicist, Nobel laureate Albert Einstein

 It is the birth anniversary of famous physicist, Nobel laureate Albert Einstein

ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గారి జయంతి

It is the birth anniversary of famous physicist, Nobel laureate Albert Einstein

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞానశాస్త్రవేత్త. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకర టింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికిపెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్ స్టీన్సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు.

అప్పట్లో న్యూటనియన్ మెకానిక్స్ కాన్సెప్ట్ సంబంధించి ఎక్కువ రోజులు భవిష్యత్తు ఉండదని ఐన్స్టీన్ గమనించారు. ఇదే ఆయన్ను ప్రత్యేకమైన కొత్త సిద్దాంతం దిశగా నడిపించింది. ఆ విధంగా ఆయన స్విస్ పేటెంట్ కార్యాలయంలో సాపేక్ష సిద్దాంతం కోసం రిజిస్టర్ చేసేలా చేసింది, మొత్తానికి చరిత్రలోనే గుర్తుంచుకునే విధంగా 1902లో స్విట్జర్లాండ్ బెర్న్ నగరానికి వెళ్లి స్నేహితుని సాయంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు.

జర్మనీ పౌరసత్వాన్ని వదులుకుని స్విట్జర్లాండ్లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆయన పనిచేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది. ఆ విధంగా ఐన్ స్టీన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు. శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లా, అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు.

అణుశక్తిని శాంతియుత ప్రయోజనా లకు మాత్రమే వాడుకోవాలని ఆయన సూచించారు. ఈయన గొప్ప శాస్త్రవేత మాత్రమే కాదు. శాంతిదూత కూడా. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్‌ బోస్‌తో కల్సి ఆయన పరిశోధనలు చేశారు. ఫోటో ఎలక్ట్రిక్‌ ప్రభావంతో పలు ప్రయోజనాలున్నాయి. కాంతి యొక్క స్వభావాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి వీలు కల్గింది. ఫైబర్‌ ఆప్టిక్స్‌, స్కానింగ్‌, టెలికమ్యూనికేషన్‌, సోలార్‌ సెల్స్‌ తయారీ తదితర విభాగాల్లో ఈ ప్రభావం ఉపయోగ పడుతుంది.

1903 లో ఐన్ స్టీన్ మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నారు. వారు కొంత కాలం బాగానే ఉన్నా ఆ తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చిగీతలు గీస్తూ కూర్చునే భర్తతో ఎలాంటి అచ్చట్లు, ముచ్చట్లు తీరవని ఆమెకు త్వరలోనే అర్ధం అయింది. ఐన్ స్టీన్ ఖాళీ లేకుండా దేశవిదేశాలకు తిరుగుతూ బిజీగా ఉన్నాడు. దీన్తో అతని భార్య ఐన్ స్టీన్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఐన్ స్టీన్ బుర్రలో ఐడియాలు తప్ప జేబులో చిల్లిగవ్వ లేదు.

తనకు త్వరలోనే నోబుల్ ప్రైజ్ వస్తుందని ఆ డబ్బు అంతా భార్యకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఐన్ స్టీన్ కి 1922 లో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతితో వచ్చిన డబ్బును తన మొదటి భార్యకు ఇచ్చేసాడు. అప్పటికే మిలెవా మారిక్ కు విడాకులిచ్చాడు. ఐన్ స్టీన్ ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మనకు ఎన్నో విషయాలను తెలియయజేసాడు.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్, ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, హాలీవుడ్ స్టార్ చార్లీ చాప్లిన్ సమావేశం:

ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టీన్, ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, హాలీవుడ్ స్టార్ చార్లీ చాప్లిన్… వీరిద్దరూ ఒక సందర్భంలో కలిశారు. 1931వ సంవత్సరంలో ఈ అరుదైన సమావేశం జరిగింది.మీ నటనలో నాకు నచ్చేది ఏమిటంటే అందులో విశ్వజనీనత ఉంటుంది. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది’ అంటూ ఐన్ స్టీన్… చాప్లిన్ ని అభినందించారు. అందుకు సమాధానంగా చాప్లిన్…‘మీరన్నమాట నిజమే. కానీ మీ కీర్తి అంతకంటే గొప్పది. మీరు చెప్పేదాంట్లో ఒక్క మాట కూడా అర్థం కాకపోయినా ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఆరాధిస్తుంది’ అన్నారు.

వారిద్దరు ఒకరి గురించి ఒకరు వ్యక్తీకరించిన అభిప్రాయాలు నూటికి నూరుశాతం నిజం కదా. అవును… వారిలో ఒకరు మనసులను అద్భుతంగా స్పందింపచేసినవారు కాగా మరొకరు మెదడుశక్తిని అద్వితీయంగా ఆవిష్కరించినవారు. చాప్లిన్ మనసు అర్థమైనట్టుగా ఐన్ స్టీన్ మెదడు అర్థం కావటం కష్టమే కదా మరి.......

ఐన్‌స్టీన్ పుట్టిన రోజే.. స్టీఫెన్ హాకింగ్ మృతి:

ఐన్ స్టీన్ జయంతి రోజే స్టీఫెన్ హాకింగ్ మరణించడం యాధృచ్ఛికం.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి మౌలిక పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది.

 ఐన్ స్టీన్ 1955 ఏప్రీల్ 18మరణించాక అయన మెదడును తీసి భద్రపరిచారు. ఇప్పటికి దాని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

సైన్స్‌ పరిశోధనలు మానవ వికాసానికే తప్ప, మానవ నాశనానికి వినియోగించకూడదనే ఐన్‌ స్టీన్‌ మాటలు నేటితరం గుర్తుంచుకోవాలి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.