Grand technogeon celebrations.. Exhibits that impressed everyone!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నోజీయాన్ 2024 జోరుగా సాగింది. ఈ సాంకేతిక ఉత్సవంలో విద్యార్థులు ఎగ్జిబిట్లతో తమ ప్రతిభను చాటారు.
వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నోజీయాన్ 2024 జోరుగా సాగింది. ఈ సాంకేతిక ఉత్సవంలో విద్యార్థులు ఎగ్జిబిట్లతో తమ ప్రతిభను చాటారు. వివిధ అంశాలకు సంబంధించి రూపొందించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాశాలకు చెందిన విద్యార్థులు రూపకల్పన చేసిన ఈవెంట్‌లో సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించాయి. ఒక్కో ఈవెంట్ ఒక్కో ప్రత్యేకతను చాటాయి. దైనందిన జీవితంలో ప్రజల అవసరాలు భవిష్యత్తులో ఎదురయ్యే నూతన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ఈవెంట్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నీట్ విద్యార్థులు తయారు చేసిన పిక్సెల్ 2 పోర్రేట్ ప్రింటరింగ్ ఈవెంట్ ఆకట్టుకుంది. ఇది ఒక మైక్రో ప్రాసెసర్‌ల రన్ అవుతుంది. ఏదైనా ఒక ఫోటో కంప్యూటర్‌లో పెడితే ఆ ఫోటోలో ఉన్నది ఉన్నట్లు ముద్రించడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా ట్రాక్ పై ఉన్న డేంజర్ బాల్స్ కు తగలకుండా ఎక్స్ బాల్ అనే యాప్ ద్వారా రిమోట్‌తో నడిపే వైఫై కంట్రోల్ కారు, జాయ్ స్టిక్ ద్వారా కంట్రోల్ చేస్తూ మోటార్స్ తిరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్న సర్కిల్లో బాల్ వేసే పింక్ పంక్ లాంచర్, లైట్ ఎటు కదిపితే అటు సెన్సార్ ద్వారా పోయే కారు ఎంతో ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు వివిధ రకాల రోబోటిక్ ప్రాజెక్టులు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఒకపక్క ఈవెంట్ల నిర్వహణతో పాటు మరోపక్క వివిధ అంశాలపై వర్క్ షాపులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వైజ్ఞానిక ప్రసంగాలు కూడా కొనసాగాయి. నిట్ విద్యార్థులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు స్వయంగా రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్లను సైతం టెక్నోజీయాలో సందర్శనార్థం పెట్టారు. టెక్నోజీయాన్ అంటే ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులకే పరిమితం చేయకుండా పాఠశాల స్థాయిలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన ఔత్సాహిక విద్యార్థులను సైతం ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.
నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు టెక్నోజీయాన్ ఈవెంట్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ టెక్నోజీయాన్ విజ్ఞానదాయకంగాను, స్ఫూర్తిమంతంగానూ ఉందని ఇందులో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు. విద్యార్థులలో వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు సమిష్టిగా కృషి చేయడానికి ఇది ఎంతో గాను ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.