X: It's the same feature on Twitter.. It's the best option for all users
X: ట్విట్టర్‌లో అదిరే ఫీచర్.. యూజర్లందరికీ ఇది బెస్ట్ ఆప్షన్
Twitter: ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పెరుగుతున్న టెక్నాలజీ సరికొత్త అడుగులకు శ్రీకారం చుడుతోంది. రోజురోజుకీ సామజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ (Face Book), ట్విట్టర్ (Twitter) లాంటి వేదికలపై జనం తాకిడి పెరుగుతోంది. నిత్యం లక్షల్లో యూజర్స్ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేసింది.
ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు ఈ X యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఇందుకోసం యూజర్లు తమ ‘ఎక్స్’ యాప్‌ను అప్ డేట్ చేసుకోడం మస్ట్. ఆ తర్వాత యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘ప్రైవసీ అండ్ సేఫ్టీ’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు డైరెక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఎంచుకుంటే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘మిమ్మల్ని అనుసరిస్తున్న వారు, మీరు అనుసరిస్తున్న వారు, వెరిఫైడ్ యూజర్లు’ అనే ఆప్షన్లలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ట్విట్టర్ ద్వారా ఇప్పటివరకు కేవలం ట్వీట్స్ మాత్రమే చేసుకునేవారు. దీని ద్వారా సమాచారం పంచుకోవడం సులువుగా ఉండేది. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేదికను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు X వేదికపై ట్వీట్స్ మాత్రమే కాకుండా ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీని ద్వారా యూజర్లు తమ ఫోన్ నంబర్ తెలియకుండానే చాటింగ్, వాయిస్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ప్రైవసీ కాపాడుకుంటూ నేరుగా కమ్యూనికేట్ కావడం కోసం ఇది అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు.