ap skill development corporation offers training in job oriented courses, salary between 15k-25k
ఏపీ స్కిల్ కార్పోరేషన్ జాబ్ గ్యారంటీ కోర్సులు- 15-25 వేల జీతంతో ఉద్యోగాలు..!
ఏపీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్ధ.. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్స్, సీడాప్-డీడీయూ-జీకేవై, డీఆర్డీయే, డ్వామా, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం సహకారంతో జాబ్ గ్యారంటీ కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వివిధ కేటగిరీల కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణా కాలంలో స్టయిఫండ్, అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కార్పోరేట్ సంస్ధల్లో ఉద్యోగాలు లభించేలా సాయం చేయబోతోంది
2018 నుండి 2022 మార్చి వరకు కరువు పని జాబ్ కార్డు కలిగి, వంద పని దినాల పూర్తి చేసిన కుటుంబాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు, ఉచిత భోజనం, ఉచిత హాస్టల్ వసతి తో కూడిన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణాంతరం ప్రముఖ ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీలలో గ్యారెంటీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం ఇవ్వడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఈ సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
ఈ ఉపాధి ఆధారిత శిక్షణా కాలం 3 నుంచి 4 నెలలు మాత్రమే. శిక్షణా కాలంలో 90 శాతం హాజరు ఉంటే రోజువారీ వేతనంగా రోజుకి 272 /రూ.లు. చొప్పున అనగా 3 నెలలకి కలిపి రూ.24,480 చెల్లిస్తారు. 4 నెలలకి అయితే రూ. 32,640 చొప్పున స్టైపెండ్ రూపంలో శిక్షణాంతరం అభ్యర్థుల బ్యాంకు ఎకౌంట్లో జమ చేస్తారు. ఇలా శిక్షణ ఇచ్చే కోర్సుల్లో అడ్మినిస్ట్రేటివ్ సేల్స్ సూపర్వైజర్, (Govt.DRDA -ట్రైనింగ్ సెంటర్,కోటప్పకొండ, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా), ఇన్వెంటరీ క్లర్క్, ట్యాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్, గుంటూరులో శిక్షణ ఇస్తారు.
ఈ శిక్షణా కాలంలో కామన్ సబ్జెక్టుగా కంప్యూటర్స్ కోర్సు , కంప్యూటర్ టైపింగ్ , స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, అదనంగా నేర్పిస్తారు. ఈ శిక్షణకు ఇంటర్, డిగ్రీ,పాస్/ ఫెయిల్, కరువు పని జాబ్ కార్డ్ కలిగిన అభ్యర్థులు అర్హులు.అలాగే వీరి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణాంతరం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ధృవపత్రాలు కూడా జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9010585360.