Amazon Great Republic Day Sale 2024: Amazon Republic Day Sale.. Huge Offers on Smartphones, Other Gadgets!
Amazon Great Republic Day Sale 2024: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్‌లపై అదిరిపోయే ఆఫర్లు!
Amazon Great Republic Day Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day sale 2024)కు సిద్హమైంది. పండుగ ఏదైనా సరే కొనుగోలుదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటూ బిజినెస్‌లో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా రానున్న రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించింది.
ప్రతి ఏడాది మాదిరిగానే అమెజాన్ రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే Amazon Great Republic Day sale 2024 జనవరి 13 మధ్యాహ్నం నుంచి మొదలవుతుందని అమెజాన్ తెలిపింది. మొబైల్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని అమెజాన్ పేర్కొంది. ప్రైమ్ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్ మొదలుకానుంది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్ మెంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు. అలాగే.. ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో ఐఫోన్ 13 మరియు వన్‌ప్లస్ 11 సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో లభిస్తాయి. ఈ-కామర్స్ కంపెనీ రాబోయే సేల్‌లో వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్‌లను అందిస్తుంది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వేర్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ఉత్పత్తులతో వివిధ వర్గాల వారికి డిస్కౌంట్ ను అందిస్తూ సేల్స్ నిర్వహించనుంది. ఈ సేల్ లో iPhone 13 నుండి OnePlus 11 వరకు, చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.