Samsung

Samsung

శామ్‌సంగ్ ఫోన్లతో సెక్యూరిటీ రిస్క్.. యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక

Samsung
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు వాడే వారికి అలర్ట్. భారత ప్రభుత్వం మీకు తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఫోన్లలో కొన్ని సెక్యూరిటీ రిస్కులను కేంద్ర ఐటీశాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది. వీటిని సరిచేసే మార్గాలను సైతం సెర్ట్-ఇన్ సూచించింది.

 ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎక్కువ భద్రతా లోపాలను సెర్ట్-ఇన్ గుర్తించింది. తాజాగా శామ్‌సంగ్ ఫోన్లలో కూడా మల్టిపుల్ వల్నరబిలిటీస్ ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. దీంతో పోన్లను వెంటనే అప్‌డేట్ చేయాలని డిసెంబర్ 13న సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. సెక్యూరిటీ రిస్క్ కారణంగా ఇబ్బంది పడకుండా, వినియోగదారులు తమ ఫోన్ OS లేదా ఫర్మ్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని సెర్ట్-ఇన్ సూచించింది.

 * ఫోన్లలో సమస్యలు ఇవే..సాఫ్ట్‌సిమ్డ్ లైబ్రరీలో వివిధ సిస్టమ్ కాంపోనెంట్స్‌లో మల్టిపుల్ మెమరీ కరప్షన్ వల్నరబిలిటీస్, డేటా సైజ్ వెరిఫికేషన్ తప్పుగా చూపడం.. వంటి సమస్యలు శామ్‌సంగ్ డివైజ్‌ల్లో ఉన్నట్లు సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. నాక్స్ (Knox) ఫీచర్లపై కంట్రోలింగ్ కోల్పోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, AR ఎమోజీ యాప్‌తో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిగా హ్యాండిల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని భద్రతా ఏజెన్సీ తెలిపింది.
* ఫోన్లలో సమస్యలు ఇవే..
సాఫ్ట్‌సిమ్డ్ లైబ్రరీలో వివిధ సిస్టమ్ కాంపోనెంట్స్‌లో మల్టిపుల్ మెమరీ కరప్షన్ వల్నరబిలిటీస్, డేటా సైజ్ వెరిఫికేషన్ తప్పుగా చూపడం.. వంటి సమస్యలు శామ్‌సంగ్ డివైజ్‌ల్లో ఉన్నట్లు సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. నాక్స్ (Knox) ఫీచర్లపై కంట్రోలింగ్ కోల్పోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, AR ఎమోజీ యాప్‌తో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిగా హ్యాండిల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని భద్రతా ఏజెన్సీ తెలిపింది.

 ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌లతో రన్ అవుతున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లలో ఈ సమస్యలు ఉన్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ అటాక్స్ ముప్పు పెరుగుతోంది. దీంతో హ్యాకర్లు శామ్‌సంగ్ గెలాక్సీ యూజర్లను సింపుల్‌గా టార్గెట్ చేయవచ్చు. ఈ డివైజ్‌ల్లోని ప్రస్తుత వల్నరబిలిటీస్‌ను యూజ్ చేసి, ఫోన్లను చాలా సింపుల్‌గా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది.

 * పరిష్కారం ఏంటి?ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడానికి శామ్‌సంగ్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లతో రన్ అవుతున్న శామ్‌సంగ్ డివైజ్ హోల్డర్లు అప్‌డేట్ కోసం చెక్ చేసుకోవాలి.
* పరిష్కారం ఏంటి?
ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడానికి శామ్‌సంగ్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లతో రన్ అవుతున్న శామ్‌సంగ్ డివైజ్ హోల్డర్లు అప్‌డేట్ కోసం చెక్ చేసుకోవాలి.

 * ఎలా అప్‌డేట్ చేయాలి?ముందు శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లండి. ఆప్షన్లలో ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్’ క్లిక్ చేసి, ఏదైనా కొత్త అప్‌డేట్ వచ్చిందేమో చెక్ చేయండి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.
* ఎలా అప్‌డేట్ చేయాలి?
ముందు శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లండి. ఆప్షన్లలో ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్’ క్లిక్ చేసి, ఏదైనా కొత్త అప్‌డేట్ వచ్చిందేమో చెక్ చేయండి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

 ఒకవేళ మీ ఫోన్‌కు ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాకపోతే, త్వరలోనే రావచ్చు. అయితే అప్పటి వరకు తెలియని సోర్సుల నుంచి వచ్చిన లింక్స్, ఫైల్స్ అస్సలు ఓపెన్ చేయకండి. అలాగే ట్రస్టెడ్ యాప్ స్టోర్ల నుంచి మాత్రమే ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.