Insurance Fraud
ఇన్సూరెన్స్ మోసాలతో జాగ్రత్త.. ఇలా చెక్ పెట్టండి..
Insurance Fraud: భారతదేశంలో ఇప్పుడిప్పుడే ప్రజలకు ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరుగుతోంది. కోవిడ్ తర్వాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. అయితే ఇలాంటి సమయాల్లో ఇన్సూరెన్స్ మోసాలు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశం.
భారతదేశంలో ఇప్పుడిప్పుడే ప్రజలకు ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరుగుతోంది. కోవిడ్ తర్వాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. అయితే ఇలాంటి సమయాల్లో ఇన్సూరెన్స్ మోసాలు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశం. పాలసీదారులు మోసగాళ్లు చెప్పే మాయమాటలు విని బలవుతున్నారు. అదే సమయంలో కంపెనీలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. వీటికి సంబంధించి ‘లైవ్‌మింట్’తో సైన్‌జీ (Signzy) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, అంకిత్ రతన్ షేర్ చేసుకున్న వివరాలు ఇలా.
డెలాయిట్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023 ప్రకారం.. భారత్‌లో లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో మోసాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై ఒక సర్వే చేయగా, దాదాపు 60% మంది మోసాలు ఎక్కువయ్యాయని, 10% మంది స్వల్ప మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. డిజిటలైజేషన్, రిమోట్ వర్కింగ్, కంట్రోలింగ్ లేకపోవడం.. వంటివి ఈ మోసాలు పెరగడానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి.
భారత ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ, రెప్యుటేషన్ కాపాడుకోవడానికి స్ట్రాటెజిక్, టెక్నాలజీ డ్రివెన్ అప్రోచ్‌తో ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ను ముందస్తుగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
