Legal Notice
లీగల్ నోటీసులు వాట్సాప్, మెయిల్ రూపంలో పంపొచ్చా.. అలా పంపితే చెల్లుబాటవుతుందా ?
వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేయవచ్చునని, పలు కోర్టులు దీన్ని ధ్రువీకరిస్తున్నాయని న్యాయ నిపుణులు తెలిపారు.
లీగల్ నోటీసులు వాట్సాప్, మెయిల్ రూపంలో పంపొచ్చా.. అలా పంపితే చెల్లుబాటవుతుందా ?
మీకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు కేసు నమోదైనప్పుడు సాధారణంగా న్యాయస్థానం మీరు నివాసం ఉండే చిరునామా (అడ్రస్)కు పంపుతుంది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారికంగా గానీ, వ్యక్తిగతంగా గానీ ఏదైనా సమాచారం తెలియజేయాలనుకుంటే వాట్సాప్, ఈ-మెయిల్, ఇతర ఎలక్ట్రానిక్ మోడ్‌ల్లో సమాచారం ఇవ్వవచ్చు. అలాగే కోర్టు నోటీసు కూడా వాట్సాప్, ఈ-మెయిల్ తదితర ఎలక్ట్రానిక్ మోడ్‌ల్లో కోర్టు నోటీసు జారీ చేయొచ్చా? అన్న అనుమానాలు ఉన్నాయి.
ఎవరైనా వాట్సాప్, ఈ-మెయిల్ తదితర ఎలక్ట్రానిక్ మోడ్స్‌లో లీగల్ నోటీసు పంపడం గానీ, స్వీకరించడం గానీ చేయొచ్చునని చాంబర్స్ ఆఫ్ భారత్ చుగ్ అడ్వకేట్ మయాంక్ అరోరా చెప్పారు. మనీ రికవరీ నోటీసు, తొలగింపు నోటీసును వాట్సాప్, ఈ-మెయిల్ తదితర మార్గాల్లో పంపొచ్చునని తెలిపారు. సాధారణంగా న్యాయస్థానాలు జారీ చేసే నోటీసులను న్యాయవాది ద్వారా జారీ చేస్తారు. కోర్టుకు వెళ్లడానికి ముందు నోటీసుల జారీ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారన్నారు. ఇప్పుడు పలు కోర్టులు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపడాన్ని గుర్తిస్తున్నాయని మయాంక్ అరోరా తెలిపారు. ఖైతాన్ అండ్ కో పార్టనర్ ఆశీష్ మెహతా స్పందిస్తూ వ్యక్తులకు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపడం ఇప్పుడు చెల్లుబాటవుతుందని చెప్పారు.