ChatGPT Rival
ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి దీటుగా బైట్‌డ్యాన్స్ వినూత్న ఏఐ ప్లాట్‌ఫాం
చాట్‌జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ (ChatGPT Rival) సహా టెక్ దిగ్గజాలు వినూత్న ఏఐ టూల్స్‌తో ముందుకొచ్చాయి.
ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి దీటుగా బైట్‌డ్యాన్స్ వినూత్న ఏఐ ప్లాట్‌ఫాం
న్యూయార్క్ : చాట్‌జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ (ChatGPT Rival) సహా టెక్ దిగ్గజాలు వినూత్న ఏఐ టూల్స్‌తో ముందుకొచ్చాయి. ఇక ఓపెన్ఏఐ త్వరలో లాంఛ్ చేయనున్న జీపీటీ స్టోర్ తరహాలో టిక్‌టాక్ మాతృసంస్ధ బైట్ డ్యాన్స్ నూతన ఏఐ టూల్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది
త్వరలోనే పబ్లిక్ బీటా వెర్షన్‌గా ఈ ప్లాట్‌ఫాం లాంఛ్ కానుంది. యూజర్లు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించేలాఈ ప్లాట్‌ఫాంను డెవలప్ చేసేందుకు బైట్‌డ్యాన్స్ కసరత్తు సాగిస్తోంది. ఈ నెలాఖరుకే ఏఐ ప్లాట్‌ఫాంను లాంఛ్ చేసేందుకు బైట్‌డ్యాన్స్ సన్నాహాలు చేపట్టిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.
న్యూ జనరేటివ్ ఏఐ ప్రోడక్ట్స్‌ను అన్వేషించడానికి, ఇప్పటికే ఉన్న వాటితో అవి కలిసిపోవడానికి అప్‌కమింగ్ ప్లాట్‌ఫాం కంపెనీని అనుమతిస్తుందని ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో కంపెనీ పేర్కొంది. యూజర్లు కస్టమైజ్డ్ చాట్‌జీపీటీ బాట్స్‌ను క్రియేట్ చేసే వెసులుబాటు కల్పించేలా ఓపెన్ఏఐ ఇటీవల లాంఛ్ చేసిన జీపీటీలకు దీటుగా బైట్‌డ్యాన్స్ న్యూ ఏఐ ప్లాట్‌ఫాం యూజర్ల ముందుకు రానుంది.