Telangana: జాబ్ రాలేదని కుంగిపోలేదు.. మామిడి తోటలో కోళ్లను పెంచుతూ లక్షలు

 Telangana: Don't feel depressed about not getting a job.. Lakhs raising chickens in a mango garden

A young man named Rajesh from Gundrathimadugu village of Kuravi Mandal, Mahbubabad district has completed his degree. He wanted to get a good job and support his parents along with him.

Telangana: జాబ్ రాలేదని కుంగిపోలేదు.. మామిడి తోటలో కోళ్లను పెంచుతూ లక్షలు

Telangana: Don't feel depressed about not getting a job.. Lakhs raising chickens in a mango garden

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం.. స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. మంచి జాబ్ సంపాదించి తనతో పాటు తల్లితండ్రులను పోషించాలనుకున్నాడు.

పలుమార్లు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా.. ఫలితం రాక విసిగి వేసారిపోయాడు. దీంతో రాజేష్ స్వతహాగా వ్యాపారం చేసి తనతో పాటు పది మందికి జీవనోపాది కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఊళ్ళో ఉన్నటువంటి మామిడి తోటను లీజుకు తీసుకొని తోటలో జాతి కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు.

కోళ్ల పెంపకం కోసం రెండు సంవత్సరాలలోనే 6 లక్షలు పెట్టుబడి పెట్టగా.. అతనికి చేతికి 15 లక్షలు రాబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో దాదాపు 10 లక్షల వరకు లాభం వచ్చిందనమాట. ఒక్కొక్క కోడిపిల్లను 12 నెలలపాటు పెంచేందుకు ఏడు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుందని, పెంచాక వాటిని అమ్ముకుంటే ఒక్కో కోడిపై మూడు, నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. తనతో పాటు ఐదుగురికి జీవనోపాధి కల్పిస్తున్నానని ఆ యువకుడు తెలిపాడు. తను చదివిన చదువుకు కావాల్సిన ఉద్యోగం లభించకపోయినా నిరుత్సాహం చెందకుండా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెరు జాతితో పాటు ఆషిల్, కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, రసంగి, మైల,స్వేతంగి జాతులతో పాటు 15 రకాల జాతి కోళ్లను పెంచుతూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడి వద్ద కోళ్లను కొనుగోలు చేసేందుకు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కస్టమర్స్ వస్తున్నారు.

తనకు ప్రభుత్వం సహకరించి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పిస్తే మరింత మందికి జీవనోపాధి కల్పిస్తానని యువకుడు రాజేష్ తెలిపారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.