Single subject Degree - Degree with only one subject! The system of three subjects will be abolished from this year
Single aubject Degree - ఒక్క సబ్జెక్ట్ తోనే ఇక డిగ్రీ! మూడు సబ్జెక్ట్ ల విధానం ఈ ఏడాది నుంచి రద్దు
ఒక్క సబ్జెక్ట్ తోనే ఇక డిగ్రీ!
♦️మూడు సబ్జెక్ట్ ల విధానం ఈ ఏడాది నుంచి రద్దు
♦️ఒకేసారి రెండు డిగ్రీలు చేసుకునే అవకాశం
♦️ఉన్నత విద్యామండలి కసరత్తు
రానున్న విద్యా సంత్సరం 2023-34 నుండి రాష్ట్రంలో ఒక సబ్జెక్ట్ ప్రధానంగా డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నా యి. ఇక మూడు సబ్జెక్ట్ విధానం రానున్న ఏడాది నుండి రద్దు కానుంది. ఇప్పటి వరకు డిగ్రీలో మూడు సబ్జెక్ట్ లు ప్రధానంగ డిగ్రీ కోర్సులుండేవి. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) నిబంధ నలు, నూతన విద్యా విధానం(ఎపి) ప్రకారం ఇక సింగిల్ సబ్జెక్ట్ ప్రధానంగా డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతు న్నారు. ఉదాహరణకు ఇప్పటివరకు డిగ్రీ బిఎస్సీ ఉంటే: మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఉండేవి. ఇక నుండి ఈ మూడింటిలో ఏదోఒకటి మాత్రమే ప్రధాన సబ్జెక్ట్ ఉంటుంది. అంటే బిఎస్సీ మ్యాథ్స్ అనో, బిఎస్సీ ఫిజిక్స్ అనో మాత్రమే ఉంటుంది. ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్ ను రూపొందించే పనిలో ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ విధానం తమిళనాడు, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ ఏడాది నుండిఏపీలోనూ అమల్లోకి రానుంది.
♦️ఈ ఏడాది నుండి అనర్స్ డిగ్రీ ప్రారంభం
అనర్స్ రాష్ట్రంలో 2020-21లోనే ప్రవేశపెట్టారు, అప్పుడు డిగ్రీలో చేరిన విద్యార్ధులకు ఇప్పుడు అనర్స్ డిగ్రీ కింద నాలుగో సంవత్సరం చదివే అవకాశ వచ్చింది. అనర్స్ డిగ్రీ చదివే విద్యార్ధులకు మూడేళ్ల డిగ్రీ కోర్సు తర్వాత పది నెలల పాటు ఇంటర్నషిప్ ఉంటుంది. డిగ్రీ చాలు అనుకునేవారికి మూడేళ్లకే డిగ్రీ పట్టా ఇచ్చేస్తారు. అనర్స్ చదవిన విద్యార్ధులకు పోస్ట్ డ్యుషన్లో ఒక ఏడాది చదివితే సరిపోతుంది. అదే డిగ్రీలో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే అసర్స్ రీసెర్చ్ లోకి వెళ్లవచ్చు. అక్కడ నుండి అర్సెట్ ద్వారా నేరుగా పిహెచ్డి చేసుకోవచ్చు.
♦️ఒకేసారి రెండు డిగ్రీలు.
ఈ విధానంలో ఒకేసారి రెండు డిగ్రీలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించను న్నారు. అంటే బిఎస్సీ మ్యాథ్స్ తోపాటు బిఎస్సీ కెమిస్ట్రీని కూడా విద్యార్ధులు ఏకకాలంలో పూర్తి చేయవచ్చు. అయితే ఇందుకోసం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు సౌకర్యాలను ప్రవేశపెట్టను న్నారు. ప్రాధాన్యతా సబ్జెక్ట్ తోపాటు ఒకటి, రెండు మైనర్ సబ్జెక్టులను కూడ కలిపి డిగ్రీ చేసుకోవచ్చు. ఆ మైనర్ డిగ్రీలను ఆన్లైన్ లో చదువుకోవచ్చు. రెండు ప్రాధన్యతా సబ్జెక్టులతో రెండు డిగ్రీలు చేయాలనుకుంటే మాత్రం వీరికి సమయం సర్దుబాటు చేయడం కొంచెం కష్టమౌతుంది. దీనిపై ఏం చేయాలా. అని ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది..