Hyderabad: Is it better to buy a flat in an apartment or an independent house?
Houses are the main need for people who come to the city and work here. If there are houses here, there will be no dhoka. But buying houses in Hyderabad is not a matter of hope.
But the same amount can be covered under EMI. But buying a house in Hyderabad is not an easy task. In the prime area, however, you have to put coats. But the areas that are little here and there have to spend lakhs.
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోవడం మంచిదా లేక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం మంచిదా?
నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసేవారికి ఇక్కడ ప్రధానమైన అవసరం ఇళ్లు. ఇక్కడ ఇళ్లు ఉంటే ఇక ఏ ఢోకా ఉండదు. అయితే హైదరాబాద్‌లో ఇళ్లు కొనడం అయితే ఆశామాషి వ్యవహారం కాదు.
మహా అయితే అదే డబ్బును ఈఎమ్‌ఐ కింద కట్టుకోవచ్చు. అయితే హైదరాబాద్‌లో ఇల్లు కొనడం అయితే ఆశామాషి వ్యవహారం కాదు. ప్రైమ్ ఏరియాలో అయితే కోట్లు పెట్టాల్సిందే. కొంచెం అటూ ఇటూగా ఉన్న ప్రాంతాలు అయితే లక్షలు పోయాల్సిందే.
అయితే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోవడం మంచిందా లేక ఇండిపెండెంట్ ఇల్లు బెస్టా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏది బెస్ట్ అనేది చెప్పలేం. ఎందుకంటే.. రెండిటికి కొన్ని ఫ్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నాయి.
అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే.. ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకునేవారు.. కాస్త డబ్బులు ఉంటే.. ఇండిపెండెంట్ ఇళ్లు బెస్ట్ ఆప్షన్.
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటే ఉండే సమస్యలు
1. ఇక్కడ చెట్లు పెంచడానికి వీలు ఉండదు, ఉన్నా చాలా తక్కువ స్పేస్ ఉంటుంది
3. కొన్ని సార్లు మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు రావొచ్చు. మనం ఎంత బాగున్నా, అవతలి వ్యక్తులు కూడా బాగుండాలి కదా.
4. మెయింటెన్స్ చార్జీలు ఉంటాయి. మనం కొన్నింటిని వినియోగించినా లేకున్నా చార్జీలు తప్పనిసరి
5. ఇంటికి పదే, పదే బంధువులు, స్నేహితులు వస్తే.. చాడీలకి కొదవ ఉండదు. వెంటనే వ్యవహారం అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ వద్దకు వెళ్తుంది.
6. పెట్ యానిమల్స్ పెంచే విషయంలో నిబంధనలు ఉంటాయి. కొన్ని చోట్ల అస్సలు అనుమతి ఉండదు.
7. మనకు కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు కార్లు ఉంటే ఇక ఇబ్బంది మాములుగా ఉండదు
8. ఎదిరింటివారు.. పక్కింటివారు సరిగ్గా లేకపోతే.. వారితో కనీసం మాట్లాడేందుకు సైతం వీలుండదు. వారు అరుపులు, కేకలు పెట్టేవాళ్లు అయితే ప్రశాంతత ఉండదు
9. నచ్చినట్లుగా అదనంగా కన్స్ట్రక్షన్ చేయడం ఏమాత్రం కుదరదు
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటే ఉండే సౌలభ్యాలు
1. ఏదైనా సమస్య ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు
2. వినాయక చవితి, నవరాత్రి లాంటి పండుగలు కలిసి జరపుకోవచ్చు..
3. పిల్లలు అందరూ కలిసి ఆడుకోడానికి వీలుంటుంది..
4. సెక్యూరిటీ బాగుంటుంది
5. షేరింగ్ ఉంటుంది కాబట్టి.. అన్ని విషయాల్లో భారం తగ్గుతుంది
ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుంటే… ఈ అంశాలన్నీ రివర్స్ అవుతాయి. మనవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు, పొవొచ్చు. ఇష్టమైన మొక్కలు పెంచుకోవచ్చు. పార్కింగ్‌కు మంచి స్పేస్ దొరకుతుంది. పక్కింటివాళ్ల గోల ఉండదు. పెట్స్ పెంచుకోవచ్చు.
అదనంగా ఏమైనా కన్‌స్ట్రక్షన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య వస్తే.. పక్కన చెప్పుకోడానికి ఎవరూ ఉండదు. పిల్లలు ఒంటిరిగా ఉండాల్సి వస్తుంది. ఇరుగుపొరుగు వారితో సంబంధాలు ఉండవు.