Food after 30 years: ముప్పై ఏళ్ళ తరువాత పక్కాగా ఇవి తీసుకోవాల్సిందే.. లేకపోతే 40ఏళ్ళకే 60లా కనబడతారు.

 Food after 30 years: After thirty years you have to take these things.. otherwise you will look like 60 by 40 years.

Food after 30 years: After thirty years you have to take these things.. otherwise you will look like 60 by 40 years..

Age increases with time. As we age, many physical changes take place. If food, exercise, stress and sleep are maintained in a balanced manner, the problem of aging will be far away.

Food after 30 years: ముప్పై ఏళ్ళ తరువాత పక్కాగా ఇవి తీసుకోవాల్సిందే.. లేకపోతే 40ఏళ్ళకే 60లా కనబడతారు..

కాలంతో పాటు వయసూ పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ శారీరకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆహారం(Food), వ్యాయామం(Exercise), ఒత్తిడి(Stress), నిద్ర(Sleep) ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తే వయసు మీద పడటం అనే సమస్య ఆమడ దూరంలో ఉంటుంది.

ఈ నాలుగింటిలో ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. 30సంవత్సరాల తరువాత ఒత్తిడులు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, పిల్లలు.. వీటి వల్ల శారీరక, మానసిక ఒత్తిడి(Physical, mental stress) పెరుగుతుంది. బీపీ, షుగర్(BP, Sugar) వంటి సమస్యలు, ఎముకలు కీళ్ళ జబ్బులు(bone, joints issues) 30ఏళ్ళ తరువాతే మెల్లగా ప్రారంభమవుతాయి. అందుకే తప్పనిసరిగా ఆహారంలో కొన్ని భాగం చేసుకోవాలి. దీనివల్ల మీ వయసు నెంబర్ పెరుగుతుందేమో కానీ మీరు మాత్రం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటారు. 30ఏళ్ళ తరువాత తీసుకునే ఆహారమే.. తదుపరి 15ఏళ్ళ శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. 30ఏళ్ళ తరువాత తప్పనిసరిగా తీసుకోవలసిన ఆహారాల గురించి తెలుసుకుంటే..

ఫైబర్..(Fiber)

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే గుండె జబ్బులు(Heart Problems), స్ట్రోక్(Stroke), టైప్ 2 డయాబెటిస్(Type-2 diabetes), కోలోరెక్టల్ క్యాన్సర్(Colorectal cancer) వంటి ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. రోజుకు 31గ్రాముల ఫైబర్(31 grams fiber per day) శరీరానికి అవసరం అవుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మొదలైనవాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఓమెగా-3 కొవ్వులు ( omega-3 fats)

ఓమెగా-3 ఫ్యాటీ కొవ్వులు మానసిక ఆరోగ్యాన్ని నిలకడగా ఉండేలా చేస్తాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది(Improves brain working). వృద్దాప్యం తొందరగా రాకుండా చేస్తుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాల్మన్ ,సార్డైన్ చేపలలో(Salmon, sardine Fishes) ఈ ఓమెగా కొవ్వులు లభిస్తాయి. అలాగే వాల్ నట్(Walnut), చియా సీడ్స్(Chia seeds), జనపనార గింజల్లో(Hemp seeds) కూడా ఓమెగా 3 ఫ్యాట్స్ ఉంటాయి.

క్యాల్షియం.. (Calcium)

వయసు పెరిగే కొద్ది ఎముకల బలం తగ్గుతుంది. మరీ ముఖ్యంగా 30ఏళ్ళ తరువాత ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతాయి. అందుకే క్యాల్షియం పుష్కలంగా తీసుకోవాలి. పెరుగు, పన్నీర్, బ్రోకలీ, బచ్చలికూర, బాదం వంటివి తప్పనిసరిగా తినాలి.

ప్లాంట్ బేస్డ్ ఫుడ్.. (Plant based food)

30ఏళ్ళు దాటాక మాంసాహారం కంటే మొక్కల నుండి లభ్యమయ్యే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. ఇవి జీవితకాలాన్ని పొడిగిస్తాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, బీన్స్ మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్లు(vitamins), మినరల్స్(Minerals), యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) కూడా సమృద్దిగా లభ్యమవుతాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉండవు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మధుమేహం సమస్య కూడా రాదు.

ప్రోటీన్స్.. (protein)

శరీరంలో కండరాలు దృఢంగా ఉండాలన్నా, దెబ్బతిన్న కండరాల మరమ్మత్తు జరగాలన్నా ప్రోటీన్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. 30ఏళ్ళ తరువాత ఇది మరింత అవసరమవుతుంది. ప్రతిరోజూ పురుషులకు 55గ్రాముల ప్రోటీన్, స్త్రీలకు 45 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ కోసం గుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు మొక్కల ఆధారిత పోషకాలు ఎక్కువగా తీసుకోవాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.