Camphor Making: Do you know how camphor is made?
Camphor Making: Camphor.. we all know this. It is widely used in the worship of God. Almost every Hindu family has it.
Apart from being used to worship God, it is also used as medicine. By using it we can get rid of many types of health problems.
Camphor Making : కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..?
Camphor Making : కర్పూరం.. ఇది మనందరికి తెలిసిందే. దేవుని ఆరాధనలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. దాదాపు ప్రతి హిందూ కుటుంబంలో ఇది ఉంటుంది.
దేవున్ని పూజించడానికి ఉపయోగించడంతో పాటు దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మనలో చాలా మందికి కర్పూరం తెలిసినప్పటికి దానిని ఎలా తయారీ విధానం గురించి మనలో చాలా మందికి తెలియదు. కర్పూరాన్ని ఒక చెట్టు నుండి తయారు చేస్తారు.
దాల్చిన చెక్క చెట్టు జాతికి చెందిన సిన్నామోనం కాంఫోరా అనే చెట్టు నుండి తయారు చేస్తారు. అందుకే కర్పూరాన్ని ఇంగ్లీష్ లో కాంఫర్ అని పిలుస్తారు. ఈ చెట్లు ఎక్కువగా భారత దేశం, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి.
ఈ చెట్టు కాండం నుండి కర్పూరాన్ని తయారు చేస్తారు. ఈ చెట్టు ఆకులను నలిపి వాసన చూస్తే కర్పూరం వాసనే వస్తుంది. కర్పూరాన్ని తయారు చేయడానికి ముందుగా కాంఫోరా చెట్టు కలపను సేకరిస్తారు.
తరువాత దీనిని పూర్తిగా ఎండబెడతారు. తరువాత దీనిపై ఉండే బెరడును తీసేసి కలపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. తరువాత ఈ ముక్కలను చిప్స్ లాగా తరుగుతారు.
ఇలా తరిగిన ముక్కలను పెద్ద పాత్రలో వేసి గాలి పోకుండా మూత పెట్టి వేడి చేస్తారు. దీని వల్ల ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటుంది.తరువాత ఈ పాత్రకు ఒక పైపును జాయింట్ చేస్తారు.
ఈ పైపు నుండి ఆవిరి ఒక కూలర్ లోకి వెళ్తుంది. ఈ కూలర్ లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియల్స్ ఉంటుంది. ఆవిరి రాగానే ఈ ఉష్ణోగ్రత వద్ద చల్లబడి స్ఫటికాలుగా మారుతుంది.
అలాగే కూలర్ కిండి భాగంలో కర్పూరం నూనె ఉంటుంది. ఇప్పుడు కూలర్ నుండి కర్పూరాన్ని వేరు చేసి ఒక జల్లి గంటెలో వేస్తారు. తరువాత దీనిని కంప్రెసర్ లో వేసి గట్టిగా వత్తుతారు.
ఇలా చేయడం వల్ల కర్పూరంలో ఉండే మిగిలిన నూనె కూడా బయటకు వస్తుంది. తరువాత ఈ స్పటికాలను దంచి పొడిగా చేస్తారు. ఆ తరువాత ఈ పొడిని కాంఫర్ మేకింగ్ మెషిన్ లో వేస్తారు.
ఈ మిషిన్ నుండి మనకు కర్పూరం బిళ్లలు బయటకు వస్తాయి. ఒక నిమిషంలో 200 కు పైగా కర్పూరం బిళ్లలు తయారవుతాయి. ఈ విధంగా కర్పూరాన్ని తయారు చేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు.
ఈ విధంగా చెట్ల నుండి తయారు చేసిన కర్పూరం చక్కటి వాసనను కలిగి ఉంటుంది. అలాగే ఈ విధంగా తయారు చేసిన కర్పూరాన్ని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.