Manager Jobs in NHAI with Salary 2 Lakhs Rs.
National Highway Authority of India invites applications for the post of Deputy General Manager and General Manager.
Total 42 posts will be filled in this notification. Selected candidates will have to work in National Authority of India related organizations across the country. Eligible and interested candidates can apply for these jobs.
రూ. 2 లక్షల జీతంతో NHAIలో మేనేజర్ ఉద్యోగాలు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 42
పోస్టుల వివరాలు:
జనరల్ మేనేజర్ (లీగల్) - 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) - 41
వేతనం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్లకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200 వరకు ఉంటుంది.
జనరల్ మేనేజర్లకు రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900 చెల్లిస్తారు.
వయసు: జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్ట వయసు 56 ఏళ్లు.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు - వర్తించదు.
అర్హత: ఈ పోస్టులకు ఎల్ఎల్‌బీ ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
జనరల్ మేనేజర్ పోస్టులకు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ 14 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ /ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: లేదు.
ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: మే 1, 2023.
వెబ్‌సైట్: https://nhai.gov.in/