స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

 Benefits of Eating Spicy Food

Some people like sweets.. some people like hot.. some people like spicy food. Especially.. many eat spicy food made with spices.

స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.

Spicy Food

కొంత మందికి స్వీట్స్ అంటే ఇష్టం.. మరికొంతమందికి హాట్ అంటే ఇష్టం.. ఇంకొంతమందికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. ముఖ్యంగా.. మసాలాలు దట్టించి చేసిన స్పైసీ ఫుడ్‌ని లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు చాలామంది. 

ఘాటైన ఆహారం తీసుకుంటే పెరిగే జీర్ణ‌శక్తి 

మసాలాలు, కారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని ఓ వైపు భయపడుతూనే మరో వైపు అదే ఫుడ్ రెగ్యులర్‌గా తింటుంటారు. ఇంతకీ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? రావా? అనే సందేహం మీకూ ఉందా? 

మసాలా దినుసులు మన భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైపోయాయి. ఏ కూర వండినా.. బిర్యానీ చేసినా ఘాటు ఘాటుగా ఉండేందుకు గరం మసాలాలు దట్టించేస్తుంటాం. ఐతే.. తీపైనా, కారమైనా, చేదైనా.. ఏదైనా సరే మోతాదు మించకుండా తింటే ఆరోగ్యానికి హాని చేయదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. శరీరానికి అన్ని రకాల రుచులూ అందాలని సూచిస్తున్నారు. ఇక.. స్పైసీ ఫుడ్ విషయానికి వస్తే లాభనష్టాలు రెండూ ఉన్నాయని వివరిస్తున్నారు. 

మసాలాతో ఎంతో మేలు 

మసాలా దినుసుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి, ఆర్థరైటిస్, వికారం వంటివి తగ్గించేందుకు మసాలా బాగా పనిచేస్తుందట. జలుబు, తలనొప్పి, ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు కొంచెం కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకంటే నాసిల్ పాసేజ్ తెరుచుకుని రిలీఫ్ పొందుతామని వైద్యులు చెబుతున్నారు. స్పైసెస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలుంటాయట. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లను, రోగ కారక బ్యాక్టీరియాతో నిత్యం పోరాడుతాయట. 

ఎక్కువ కాలం బతుకుతారట 

స్పైసీ ఫుడ్ తీసుకోని వారితో పోల్చితే తరచు స్పైసీ ఫుడ్ తీసుకునే వారికి జీవిత కాలం పెరుగుతుందట. ఈమేరకు ఇంగ్లండ్‌లోని ఓ యూనివర్శిటీ పరిశోధన చేసి తేల్చింది. స్పైసీ ఫుడ్ తినేవారిలో మరణాల శాతం తక్కువ అని మరో పరిశోధన తేల్చింది. క్యాన్సర్ కారక కణాలతో స్పైసీ ఫుడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పోరాడి.. నిరోధిస్తాయట. కాన్సర్ కణాల పెరుగుదలను కూడా అరికడతాయట. 

  • ఆకలిని నియంత్రిస్తుంది 
  • శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు స్పైసీ ఫుడ్ సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.
  • మాంచి మసాలా దట్టించిన ఘాటైన ఆహారం తీసుకుంటే జీర్ణ‌శక్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ధకం సమస్యలు ఉండవు.
  • మన శరీరంలో మెటబాలిజమ్ పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో స్పైసీ ఫుడ్ దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయట. 

స్పైసీ కెమికల్ కాంపౌండ్ 

మసాలా దినుసుల్లో ఉండే క్యాప్సైసిన్ అనే స్పైసీ కెమికల్ కాంపౌండ్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని డైటీషియన్స్ చెబుతున్నారు. స్పైసీ ఫుడ్ తింటూనే మనం హెల్తీ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొంతమందికి గరం మసాలాను జామ కాయలపైన, దోసకాయలపైన చల్లుకుని తినే అలవాటుగా ఉంటుంది. సైనసైటిస్‌తో బాధ పడే వారి ఇలా తింటే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అల్లం, నిమ్మరసం, మిరియాలను వేడి నీటిలో తేనె కలిపి తాగితే జలుబు తగ్గే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

ఎక్కువగా తీసుకుంటే 

ఎక్కువ కారంగా ఉన్న ఆహారం లేదా మసాలా జోడించిన స్పైసీ ఫుడ్ అధిక మొత్తంలో తీసుకుంటే కూడా చాలా నష్టాలున్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినే వారి నాలుక‌పై ఉండే టేస్ట్ బడ్స్.. రుచిని ప‌సిగ‌ట్టే సామ‌ర్థ్యాన్ని కోల్పోతాయట. కారం దట్టించిన ఫుడ్ తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంత మందిలో కనిపిస్తాయట. చ‌ర్మంపై కొంద‌రికి ద‌ద్దుర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. 

బరువు తక్కువగా ఉండేవారు 

బరువు తక్కువగా ఉన్న వారు స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మేలు. సాధారణంగా వీరు నిత్యం తక్కువ మోతాదులోనే ఆహారం తీసుకుంటారు. స్పైసీగా ఉండే ఫుడ్‌ అయితే ఇంకాస్త తగ్గించేస్తారు. కొన్ని రకాల మసాలా దినుసులు నోట్లో పళ్లకు హాని చేస్తాయట. మసాలా ఐటమ్స్ ఎక్కవగా తీసుకునే వారికి చెమట ఎక్కువగా పడుతుందట. క్రమంగా దుర్వాసనకు దారి తీస్తుందట. 

మసాలా దినుసుల ఉపయోగాలు  

ఇక.. మనం నిత్యం వంటల్లో ఉపయోగించే మేజర్ మసాలా దినుసులను పరిశీలిస్తే.. అల్లం అజీర్తికి మంచిది. కఫానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. టీ లో అల్లం మిక్స్ చేసుకుని తాగితే తలనొప్పి చిటెకెలో మాయమవుతుంది.

భోజనం చేసిన వెంటనే కొద్దిగా జీలకర్ర తింటే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చేసే గుణం కూడా జీలకర్రకు ఉంది. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో.. శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుదలకు దోహద పడుతుంది.

ఆవాలకు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే శక్తి ఉంది. ఆవ పొడి, ఆవ నూనెతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మిరియాలు యాంటి బయోటిక్స్ గానూ పనిచేస్తాయి.

మెంతుల్లో బ్లడ్ థిన్నింగ్ గుణం ఉంది. మెంతులను నీట్లో నానబెట్టి ఆ నీటిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయట. మెంతుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, బి1, బి2 సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఆయుర్వేద వైద్యులు మెంతులనే సజెస్ట్ చేస్తుంటారు.

ఇన్ఫ్లమేషన్, అజీర్ణం, హై బీపీ సమస్యలతో సతమతమయ్యే వారు చిటికెడు వామును వంటకాల్లో వేస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి. నేరుగా పచ్చి వామును తీసుకున్నా మంచిదే.

పసుపులో కాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. పసుపు యాంటీ బాక్టీరియల్ మెడిసిన్‌గానూ పని చేస్తుంది.

దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా వంటకాల్లో జోడిస్తే గుండె పని తీరు మెరుగు పడుతుందట. గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చట. బ్లడ్ షుగర్ నియంత్రణకు, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు పెంచడానికి దాల్చిన చెక్క దోహదం చేస్తుందట.

విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు యాలకల్లో పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ థిన్నర్‌గానూ యాలకులు పనిచేస్తాయట.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.