Traffic Challan: Alert to motorists.. fine even if you wear helmet.. know why..
New Motor Vehicle Act 2019: Road accidents are increasing day by day in the country. Statistics show that road accidents are mainly due to over speeding and negligence.
Traffic Challan: వాహనదారులకు అలర్ట్.. హెల్మెట్ పెట్టుకున్నా సరే ఫైన్ తప్పదు.. ఎందుకో తెలుసుకోండి..
New Motor Vehicle Act 2019: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.
కాగా.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడానికి, రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి 1998 చట్టాన్ని సవరించి.. కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 1న కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయితే.. ఈ చట్టంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరింత సన్నద్ధమవుతున్నారు. ఎక్కువగా ద్విచక్రవాహనాలతోనే (Motorcycle) ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ద్విచక్రవాహనదారులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
వాస్తవానికి ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి. కాగా.. చాలామంది దీనిని తరచూ ఉల్లంఘిస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తులు కూడా హెల్మెట్‌ను ధరించడం లేదు. మరికొంతమంది హెల్మెట్ ఉన్నా.. స్టైల్ కోసం వాటిని పెట్టడం లేదు. అయితే.. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే జరిమానా విధిస్తారు. అయితే హెల్మెట్ ధరించినా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉంది. దీనివల్ల రూ.2000 ట్రాఫిక్ చలాన్ పడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఒక రైడర్ మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు హెల్మెట్ స్ట్రిప్ ధరించకపోతే రూల్ 194D MVA ప్రకారం అతనికి రూ.1000 చలాన్ విధిస్తారు.
నాసిరకం హెల్మెట్ ధరించి ఉన్నట్లు గుర్తించినా.. లేదా BIS రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆ రైడర్‌కు 194D MVA ప్రకారం మరో రూ.1000 చలాన్ విధిస్తారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫైడ్ హెల్మెట్‌లను మాత్రమే విక్రయించాలని రెండేళ్ల క్రితం కేంద్రం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. రోడ్డు భద్రతపై కమిటీ మార్చి 2018లో దేశంలో తేలికైన హెల్మెట్‌లను సిఫార్సు చేసింది. దీంతోపాటు బీఐఎస్ సర్టిఫైడ్ తప్పనిసరి చేసింది.
రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడానికి భద్రతా నియమాలను సరిచేసంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్, పిల్లలకు బెల్ట్‌లను ఉపయోగించాలి. అలాగే వెహికల్ వేగాన్ని కేవలం 40 కిమీకి పరిమితం చేసింది. కొత్త ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘిస్తే కజ.1,000 జరిమానా, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు.
ఒకవేళ సిగ్నల్స్ (రెడ్ లైట్) క్రాస్ చేయడం, ఓవర్ రైడింగ్, ఎదురుగా రావడం.. ఇంకా పలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. రూ. 2,000 జరిమానా విధిస్తారు.
అలాంటి సమయాల్లో రూ.20వేలు ఫైన్..
మోటార్‌సైకిల్‌దారులకు పైన పేర్కొన్న ఉల్లంఘనలు కాకుండా.. వాహనాన్ని ఓవర్‌లోడ్ చేసినందుకు రూ.20,000 భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో టన్నుకు రూ.2,000 అదనపు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.