Why is high BP even in young people?

Why is high BP even in young people?

చిన్న వయసు వారిలో కూడా హై బిపి ఎందుకుంటుంది?

Why is high BP even in young people?

నేటికాలంలో చిన్న వయసు వారు కూడా హైబిపి (అధిక రక్తపోటు)కి గురవుతున్నారు. హైబిపి సమస్య రావడానికి పలు అనారోగ్య సమస్యలతోపాటు, నేటి జీవన శైలి కూడా ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం లేకుండా చిన్న వయసులో అంటే 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లు లోపు వయసు వారైనప్పటికీ రక్తపోటుకి గురయ్యే అవకాశముందని వైద్యులు సూచిస్తున్నారు. 

అసలు అధిక రక్తపోటు రావడానికి గల కారణాలేంటి? వంటి విషయాలను తెలుసుకుందామా..!

- అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా గుండె సమస్యలకు గురవుతారు అన్న అపోహలను వైద్యులు నమ్మొద్దని చెబుతున్నారు.

- హైపర్‌ థైరాయిడిజం ఉన్న వారు అధిక రక్తపోటుకి గురయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

- కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో కూడా అధిక రక్తపోటుకి లోనయ్యే అవకాశముందని డాక్టర్‌ సెహ్రావత్‌ తెలిపారు.

- అధిక రక్తపోటు ఎనిమిది మంది యువకుల్లో ఒక్కరికైనా తీవ్ర ప్రభావితం చేస్తుంది అని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనం వెల్లడించింది.

- అధిక రక్తపోటుకి గురికాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువ లేకుండా తగు మోతాదులో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.