TS ECET 2023
TS ECET - 2023: టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తు మొదలైంది, దరఖాస్తు చేసుకోండి - చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023 దరఖాస్తుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్యం రుసుంతో మే 8 వరకు, రూ.2500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12 వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు...
➥ టీఎస్ఈసెట్- 2023
ప్రవేశ కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్-2023) ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02-05-2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 08-05-2023.
➥ రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 12-05-2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 08-05-2023 నుంచి 12-05-2023 వరకు.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 15-05-2023.
➥ ఈసెట్ పరీక్ష తేది: 20-05-2023.
పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)

