పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు 2023

 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు 2023

'నిఘా' నీడలో పదో తరగతి పరీక్షలు, అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశాలు!

Instructions on Installation of CC Cameras at telangana SSC Exams

రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది.

Instructions on Installation of CC Cameras at telangana SSC Exams 'నిఘా' నీడలో పదో తరగతి పరీక్షలు, అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశాలు!

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

➥ ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్న 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు 

➥ ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు పరీక్షల నిర్వహణ

రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది. సీల్‌ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్‌ చేసే ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల డైరెక్టర్ విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్ష పేపర్ల లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కెమెరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వబడుల సెంటర్లన్నింటిలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఏ కృష్ణారావు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

సీసీ కెమెరాల వినియోగం, పర్యవేక్షణ ఇలా..

➥ పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్‌, 30 మీటర్ల రేంజ్‌, 180 డిగ్రీల వరకు కవర్‌చేసేలా సీసీ కెమెరా ఉండాలి.

➥ సీసీటీవీ పుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

➥ చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలి.

➥ ఒక్కో కెమెరా కిరాయికి రూ.586, కొనుగోలు చేయాలనుకొంటే రూ.6,900 వెచ్చించవచ్చు.

➥ పరీక్షల్లో రికార్డు అయిన డేటాను నిక్షిప్తంచేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్‌కాపీని భద్రపరచాలి.

➥ సీసీటీవీ కెమెరాల కొనుగోలు లేదా కిరాయి కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.

➥ ప్రైవేట్‌ బడుల సెంటర్లలో ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.