తెలుగులో చైన వాల్ హిస్టరీ
The Wall of China is one of the 7 Wonders of the World. China Wall is famous for being the longest standing structure among these 7 Wonders. It is known as The Great Wall of China.
Construction of China Wall
The construction of this Great Wall of China began in the 7th century BC and continued to be built by the kings of many kingdoms until the 16th century AD.
In the 7th century BC, the ruling kings of China built a wall around their kingdoms to protect them from the Mongolian tribes to the north. Later, an emperor named "Qin Shi Huang" fought against his rivals and made the whole of China a single empire. This king "Qin Shi Huang" demolished some of the walls that were obstructing his kingdom and built a great wall connecting the remaining walls of his empire to the north. This wall was built with stones, mud and wood found in the plains in the hilly area. The construction of this China wall was not done because of many kings who came in the later period.
ప్రపంచంలోని 7 వింతలలో చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా China Wall ప్రసిద్ధి చెందింది. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తారు.
China Wall నిర్మాణం
ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం క్రీ.పూ 7 వ శతాబ్దంలో ప్రారంభమై క్రీ.శ 16 వ శతాబ్దం వరకు అనేక రాజ్యాల రాజుల చేత నిర్మిపబడుతూ వచ్చింది.
క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దంలో చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి రాజ్యాలకు ఉత్తర దిక్కు ఉన్న మంగోలియన్ తెగల నుండి రక్షణ కొరకు వారి రాజ్యాల చుట్టూ గోడను కట్టుకున్నారు. తరువాతి కాలంలో “ఖిన్ షీ హువాంగ్” అనే చక్రవర్తి తన ప్రత్యర్ధులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేసాడు. ఈ “ఖిన్ షీ హువాంగ్” అనే రాజు తన రాజ్యములో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన సామ్రాజ్యంలో ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మించాడు. ఈ గోడను కొండల ప్రాంతంలో అక్కడ మైదాన ప్రాంతంలో దొరికే రాళ్లతో, మట్టితో మరియు చెక్క తో నిర్మించారు. ఆ తరువాత కాలంలో వచ్చిన అనేక రాజులు వల్ల ఈ China wall నిర్మాణం జరగలేేదు.
చాలా కాలం తర్వాత క్రీ. శ 14 వ శతాబ్దంలో “మింగ్ వంశ” రాజులు తమ రాజ్యాన్ని మంగోలియన్ల నుండి కాపాడుకోవడం కోసం మళ్ళీ ఈ గోడను కట్టడం ప్రారంభించారు.
మింగ్ వంశ రాజుల కాలంలో రాళ్లతో, మట్టితో కట్టడం వల్ల ఈ గోడ నేటికి నిలిచి ఉంది. ఈ మింగ్ వంశ రాజుల కాలంలో దాదాపుగా 8,850 కి.మీ చైనా వాల్ నిర్మించారు. దాదాపుగా 25,000 వాచ్ టవర్లు గోడ మధ్య మధ్యలో కొండల ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించారు. ఈ వాచ్ టవర్స్ వల్ల శత్రువుల దాడిని ముందే పసిగట్టి ఒక టవర్ నుండి మరొక టవర్ కి సమాచారం అందచేసి యుద్దానికి ముందుగానే సిద్ధం అయ్యేవారు.
చైనా లో తరువాత 16 వ శతాబ్దంలో చైనా రాజ్యం మొత్తం ” ఖిన్గ్ డైనోస్ట్ ” చేతికి వచ్చింది. ఈ రాజులు మంగోలియా దేశంలోని కొంత భాగాన్ని తమ సామ్రాజ్యంలో కలుపుకోవడం వల్ల చైనా దేశం చైనా వాల్ ని దాటి విస్తరించింది. దీనితో చైనా వాల్ ని కట్టడం ఆపివేశారు.
China Wall గురించి మరికొన్ని ముఖ్య విషయాలు
- ఈ China Wall 5 నుండి 6 మీటర్ల వెడల్పు మరియు 7 నుండి 8 మీటర్ల ఎత్తు ఉంటుంది.
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 km ఉంటుంది
- చైనా వాల్ నిర్మించడానికి పది లక్షల మంది వరకు పనిచేశారు. గోడను కట్టే క్రమంలో దాదాపుగా నాలుగు లక్షల మంది కార్మికులు మరణించారు.
- ప్రతి సంవత్సరం దాదాపుగా కోటి మంది టూరిస్టులు ఈ చైనా వాల్ ను సందర్శిస్తుంటారు.
- భూమి పైన మనుషుల చేత కట్టబడిన అతి పొడవైన కట్టడంగా ఈ చైనా గోడ మాత్రమే ప్రాచుర్యం పొందింది. మానవ నిర్మితంతో కట్టబడిన ఈ గోడ అనేక చైనా రాజుల చేత కొన్ని వందల సంవత్సరాలు కట్టించబడింది.
- China Wall అనేది అంతరిక్షం నుండి చుస్తే కనపడుతుందనేది అవాస్తవం. అంతరిక్షం నుండి కొన్ని ప్రత్యేక పరికరాలతో చూసినట్ట్లైతే మనకు ఇది చిన్న గీత లాగ కనబడుతుంది.
- చైనా వాల్ పర్యాటక ప్రదేశంగాను మరియు చైనా దేశపు జాతీయ చిహ్నంగా నిలిచి ఉంది.
- చైనా గోడ మధ్యలో మనకు చాలా బురుజులు, టవర్లు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి పురాతన కాలంలో శత్రువుల కదలికలను గుర్తించడానికి, సైగల ద్వారా సందేశాలను పంపడానికి ఈ నిర్మాణాలు చాలా ఉపయోగపడ్డాయి.
- చైనా గోడ కట్టడం చైనా దేశం దాటి విస్తరించడంతో అప్పటి నుండి చైనా వాల్ కట్టడం ఆపేసారు.
- చైనా గోడ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ గూడలోని ఇటుకలను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం వల్ల ఈ గోడ చాలా వరకు దెబ్బతింది. అంతే కాకుండా కొందరు ఈ గోడలోని రాళ్లను దొంగలించి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. దీని వలన కూడా చైనా వాల్ నష్టపోతోంది.
- 2009 లో నదులలో, కొండ ప్రాంతాలలో దాగి ఉన్న 180 కి,మీ చైనా వాల్ ని గుర్తించడం జరిగింది. మళ్ళి 2015 లో కూడా కనుమరుగైన మరో 10 కి,మీ చైనా వాల్ గుర్తించారు.
- చైనా వాల్ నిర్మించడానికి 10 లక్షల కంటే ఎక్కువ కార్మికులు పనిచేశారు. ఇంత పెద్ద గోడను కట్టే క్రమంలో దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు. అందుకే కొంతమంది ఈ చైనా వాల్ ను అతిపెద్ద స్మశాన వాటిక అనికూడా పిలుస్తుంటారు.