ఇంటర్నెట్ లేకున్నా.. ఆఫ్‌లైన్‌లోనే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!
Even if there is no internet.. you can make online payments offline.. know how..!
UPI Payments : Nowadays everyone is moving towards digital payments. But these services must have internet. Apart from that, it is known that any small network problems in the case of payments are unavoidable. However.. recently found a way to this problem. UPI transactions can be done even if there is no network. Let's find out how..
Lately most of the people are relying on UPI payments for money transfers. Sometimes network problems occur during these transactions. But a new service is available that transfers money with just an offline process without working with the network. Most of us don't know this. National Payments Corporation of India (NPCI) to further improve UPI services across banks in India '*99
UPI Payments : ప్రస్తుతం అందరూ డిజిటెల్ చెల్లింపుల వైపే వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్‌వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్‌వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్‌వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే.
ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఆఫ్‌లైన్‌లోనూ చేయొచ్చు:
మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయాలి.
తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఐఎఫ్‌ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం.. కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.
ఇది పూర్తికాగానే కింది ఆప్షన్లు కనిపిస్తాయి.
Send Money
Request Money
Check Balance
My Profile
Pending Request
Transactions
UPI Pin
పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటే.. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయాలి.
అనంతరం మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోవాలి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి send ఎంటర్ చేయాలి.
మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే.. రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపాలి.
అనంతరం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి send ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా కంప్లీట్ అవుతుంది.

