స్మార్ట్‌ఫోన్‌లో ఈ 5 తప్పులు చేస్తే రిస్కే! హ్యాక్ అయ్యే ప్రమాదం
If you do these 5 mistakes in the smartphone, it is risky! Risk of being hacked
Don't make these mistakes on a smartphone
Nowadays almost everyone is using smartphones. Especially the users of Android mobiles are high. More and more people are using smartphones for everything from entertainment to payments. Close friends, family members, and many people call for work. Valuable personal information is also stored in the smartphone itself. That is why mobiles should be used very carefully. In order to keep the data on your smartphone secure and safe from hacking, there are some mistakes that should not be made. See that. If you are making these mistakes, stop immediately.
No external apps
Apps on Android smartphones should be downloaded only from the Google Play Store. Do not download apps from unofficial sources and third party app stores. There is a risk of malware and spyware in apps installed from external sources. That's why such apps become dangerous for your data on the phone. Hackers can steal your personal information and banking passwords. That's why it's better for Android users to download apps from Google Play Store only.
స్మార్ట్‌ఫోన్‌లో ఈ తప్పులు చేయవద్దు
ప్రస్తుతం దాదాపు అందరూ స్మార్ట్‌ఫోన్‌లను (Smartphones) వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజర్లు అధికంగా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ దగ్గరి నుంచి పేమెంట్స్ వరకు స్మార్ట్‌ఫోన్‌నే ఎక్కువ మంది వాడుతున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పని నిమిత్తం చాలా మందికి కాల్స్ చేస్తుంటారు. విలువైన వ్యక్తిగత సమాచారాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్ చేసుకుంటుంటారు. అందుకే మొబైళ్లను చాలా జాగ్రత్తగా వాడాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటా భద్రంగా ఉండాలన్నా, హ్యాకింగ్‌కు గురి కాకుండా సేఫ్‌గా ఉండాలన్నా కొన్ని తప్పులు అసలు చేయకూడదు. అవేంటో చూడండి. ఈ మిస్టేక్స్ మీరు చేస్తుంటే వెంటనే మానేయండి.
బయటి యాప్స్ వద్దు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లో యాప్స్‌ను కేవలం గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్‌అఫీషియల్ సోర్స్‌లు, థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకూడదు. బయటి సోర్స్‌ల నుంచి ఇన్‌స్టాల్ చేసుకునే యాప్స్‌లో మాల్‌వేర్ (Malware) , స్ప్రైవేర్ (Spyware) ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి యాప్స్ ఫోన్‌లో మీ డేటాకు ప్రమాదకరంగా మారతాయి. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు దోచేయవచ్చు. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.
ఓఎస్ అప్‌డేట్స్‌పై నిర్లక్ష్యం వద్దు..
మొబైల్ బ్రాండ్స్.. తరచూ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌డేట్స్ ఇస్తుంటాయి. అపరేటింగ్ సిస్టమ్ (Operating System), సెక్యూరిటీ (Security) అప్‌డేట్లను తీసుకొస్తుంటాయి. దీంట్లో చాలా కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీకి చెందిన విషయాలు ఉంటాయి. ఏవైనా బగ్స్ ఉన్నా.. సెక్యూరిటీకి సంబంధించిన లోపాలు ఉన్నా ఫిక్స్ చేస్తుంటాయి. అందుకే అప్‌డేట్స్ వస్తే వీలైనంత త్వరగా చేసుకోవడం మంచిది. కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా మెరుగ్గా ఉంటుంది.
ఓల్డ్ యాప్స్ వద్దు
స్మార్ట్‌ఫోన్‌లో పాత వెర్షన్ యాప్స్‌నే కొందరు వాడుతుంటారు. అప్‌డేట్‌లు వచ్చిన చేసుకోరు. ఇది కూడా సెక్యూరిటీకి రిస్కే. యాప్స్ అప్‌డేట్ వల్ల కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీకి చెందిన బగ్స్ ఏవైనా ఉంటే కూడా ఫిక్స్ అవుతాయి. డెవలపర్స్ ఎక్కువగా అప్‌డేట్‌ల ద్వారా కొత్త సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేస్తుంటారు. అందుకే యాప్ అప్‌డేట్ చేసుకోవాలని నోటిఫికేషన్ కనిపిస్తే.. ఎక్కువ కాలం వేచిచూడకుండా అప్‌డేట్ చేసుకుంటే బెస్ట్.
పబ్లిక్ వైఫై అసలే వద్దు
ఫ్రీగా వస్తుంది కదా అని స్మార్ట్‌ఫోన్‌లో పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవొద్దు. పబ్లిక్ వైఫై, పాస్‌వర్డ్ లేని వైఫై నెట్‌వర్క్‌లను వినియోగించడం రిస్క్ అవుతుంది. పబ్లిక్ వైఫై వాడితే హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హ్యాకర్లు మీ డివైజ్‌ను యాక్సెస్ చేసే రిస్క్ ఎక్కువ. మీ డేటాను దోచేసే ప్రమాదం ఉండొచ్చు. అందుకే పబ్లిక్ వైఫైను వాడకపోవడమే మంచిది.
ఈ 'రూట్' వద్దు
డివైజ్ సాఫ్ట్‌వేర్, యూఐ మార్చాలకునే కొందరు స్మార్ట్‌ఫోన్‌లను రూట్ (Smartphones Root) చేస్తుంటారు. ఈ విధానం కూడా సెక్యూరిటీ ముప్పుగా ఉంటుంది. ఫోన్‌ను రూట్ చేసి కస్టమ్ ROMsను ఇన్‌స్టాల్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. దీని వల్ల సెక్యూరిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేయడం అంత మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్ రూటింగ్ విధానం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు కూడా రూట్ చేయకపోవడమే మంచిది.

