Online Shopping: ఆన్ లైన్ లో చీరలు కొనేవారంతా ఇది చూడాల్సిందే.

 Online Shopping: ఆన్ లైన్ లో చీరలు కొనేవారంతా ఇది చూడాల్సిందే.

Online Shopping: ఆన్ లైన్ లో చీరలు కొనేవారంతా ఇది చూడాల్సిందే.

Online Shopping: ఆన్ లైన్ మోసాలకు అంతేలేదు. మోసపోయే వాళ్లున్నంత కాలం మోసం చేసే వారు కూడా ఉంటారు. దీంతో అప్పనంగా డబ్బులు వస్తున్నాయనే ఆశలో ఎంతో మంది ఉన్న సొమ్మును గుల్ల చేసుకుంటున్నారు. తీరా తెలిశాక మోసపోయామని వాపోతున్నారు. చెరువుల నీళ్లు పోయి చెరువు వెనుక పడ్డాక ఏముంటుంది. అది మోసపోకముందే ఉండాలి. తీరా మోసం జరిగాక చేసేదేముంది కేసులు అంటూ పోలీసుల చుట్టు తిరగడమే. కానీ ఎన్ని విధాలుగా జాగ్రత్తలు చెబుతున్నా మోసాలకు గురవుతున్న వారు ఇంకా ఉంటూనే ఉండటం గమనార్హం.

తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన ఓ ఇల్లాలు ఇలాగే మోసపోయింది. ఆన్ లైన్ లో చీర బుక్ చేసుకుంది. చీర ఖరీదు రూ.1350 ఉండటంతో బాగుందని బుక్ చేసింది. దీంతో రెండు మూడు రోజుల్లో చీర ఇంటికి వచ్చింది. డబ్బులు ఇచ్చి చీర తీసుకుంది. దాంతో పాటు ఓ కార్డు కూడా వచ్చింది. అయితే కార్డు గురించి తనకు తెలియక పక్కన పెట్టేసింది. తరువాత రెండు మూడు రోజులకు ఓ అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చింది. మేడమ్ మా కంపెనీ నుంచి చీర కొన్నందుకు ధన్యవాదాలు అంటూ అవతలి వ్యక్తి మాటలు కలిపాడు.

దీంతో ఆమె కూడా అతడితో మాట్లాడింది. మేడమ్ మేం మీకో కార్డు పంపించాం కాదు. దాన్ని గీకితే మీకు ఓ గిఫ్ట్ ఆఫర్ ఉంటుంది. దాన్ని మీకు పంపిస్తాం అని చెప్పేసరికి కార్డును గీకి చూసింది. అందులో రూ.13.50 లక్షల బహుమతి వచ్చినట్లు ఉంది. దీంతో అవతలి వ్యక్తి మేడమ్ మీ బ్యాంక్ ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్ పంపాలని కోరాడు. దీంతో ఆమె సంతోషం పట్టలేక పంపింది. అలా ఇలా దాదాపు రూ. 1.30 లక్షలు దండుకున్నాడు. ఇక మేడమ్ మీకు మూడు రోజుల్లో ఆ రూ.13.50 లక్షల చెక్కు వస్తుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

మూడు రోజులు అయిపోయాయి. మూడు వారాలు దాటాయి. కానీ చెక్కు మాత్రం రాలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ ఫక్కీలో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఎన్నో ఉన్నాయి. దీంతో మనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నా ఇలాంటి వారు ఇంకా మోసాలకు గురవుతున్నారు. ఆమె ఏకంగా రూ.1.30 లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటోంది. కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా అప్పనంగా పోయేసరికి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. సో జాగ్రత్త సుమా. ఏది కూడా కష్టపడకుండా రాదు. కష్టపడకుండా వచ్చిందేది కూడా నిలవదు అన్నట్లు సులభంగా వచ్చే డబ్బు కోసం తాపత్రయపడటం అత్యాశే అవుతుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.