Chanakya Niti: Women like men with these qualities.
Chanakya Niti: చాణక్య నీతి: ఈ లక్షణాలున్న మగాళ్లంటేనే స్త్రీలు ఇష్టపడతారు.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో నీతి సూత్రాలు వివరించాడు. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపాడు. మనిషి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని సూచించాడు. ఆనాడు ఆయన సూచించిన మార్గాలు నేటికి కూడా అనుసరణీయంగా ఉన్నాయి. అప్పటి కాలంలో కూడా అతడు చెప్పిన విషయాలు ఇప్పుడు మనకు అన్వయం అవుతున్నాయి. అంతటి దూరదృష్టితో చాణక్యుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేందుకు మనం ఏం చేయాలో చెప్పాడు. చాణక్యుడు రాసిన నీతి శాస్త్రం ఇప్పటికి కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోందంటే అతిశయోక్తి కాదు.
చాణక్యుడి అంచనాల ప్రకారం ఆడవాళ్లు ఎలాంటి పురుషులను ఇష్టపడతారో సూచించాడు. చాణక్య విధానాల వల్ల మన నిత్య జీవితంలో మనకు పనికి వచ్చే విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి. మనిషి మంచి జీవనం గడిపే క్రమంలో జీవిత భాగస్వామి కూడా మంచిదై ఉంటేనే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఇదే క్రమంలో ఆడాళ్లు ఎలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడతారో చెప్పి దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు చిట్కాలు చెప్పాడు. పురుషుల్లో ఎలాంటి లక్షణాలు మహిళలు సరే అంటారో చాణక్యుడు వివరించాడు.
మహిళల పట్ల మంచి అభిప్రాయం
ఆచార్య చాణక్యుడి ప్రకారం మహిళలను గౌరవించే వారిని స్త్రీలు ఎక్కువగా అభిమానిస్తారు. మహిళలతో మర్యాద, వినయంగా ఉండేవారిని ఇష్టపడుతుంటారు. వారినే తమ జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఆడవారితో మంచిగా వ్యవహరించే వారిని జీవితకాలం తమ భాగస్వామిగా చేసుకోవాలనుకోవడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో మహిళల ఆత్మగౌరవన్నా కాపాడే వారిని ఇంకా ఎక్కువగా అభిమానంతో చూస్తారు.
ప్రశాంతంగా..
పురుషులు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎంతటి ఆపద సమయంలోనైనా సావధానంగా ఉండే వారి పట్ల వారికి అభిమానం పెరుగుతుంది. సున్నితమైన మనస్సు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని తమ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశ పడుతుంటారు. మాటలో వినయం, ప్రశాంతత ఉంటేనే స్త్రీలు మగవారిని తమకు సరైన వారిగా చూస్తారు. అలాంటి వారినే ఎక్కువగా కోరుకుంటారు. వారితోనే జీవితం పంచుకోవాలని కలలు కంటుంటారు.
జీవిత భాగస్వామి..
ఆచార్య చాణక్యుడు సూచించిన దాని ప్రకారం మహిళలు పురుషుల వ్యక్తిత్వాన్ని చూస్తారు. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న సమయంలో అందం కన్నా అందమైన మనసు ఉండాలని ఆకాంక్షిస్తారు నిజాయితీ, కష్టపడి పనిచేసే వ్యక్తులను చూసి మహిళలు ఆరాధిస్తారు. మంచి మనసు కలిగిన వారికి మంచే జరుగుతుందని చెబుతుంటారు. ఇలా చాణక్యుడి అంచనా మేరకు ప్రతి మహిళ తన భాగస్వామి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతుంటారు. తమ భర్తగా చేసుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు.