The looming clouds of war... will they affect these areas in the Telugu states?
India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలపై ప్రభావం?
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్తాన్ పాలకులు కలవర పాటు చూస్తున్నారు.
యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెబుతున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే కనిపిస్తున్నాయి ప్రగల్బాలు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుద్ధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్ కు అందనంత ఎత్తులో ఉంది. కాగా.. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలను రేపు అంటే మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సైరన్లు మోగుతాయి.
మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లు మోగుతాయి. దాడులు జరిగే చోట జనాలు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌర రక్షణ శిక్షణలో , విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. క్రాష్ బ్లాక్అవుట్ ఏర్పాట్లు చేస్తారు. ఇలా దేశంలో మొత్తం 244 నగరాల్లో మాక్ డ్రిల్ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అదే విధంగా తెలంగాణలోని క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌లో యుద్ధ సైరన్ మోగుతుంది. రేపు హైదరాబాద్లో సాయంత్రం 4గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించారు.. నాలుగు జిల్లాల మాక్ డ్రిల్ నిర్వహించనున్న డిఫెన్స్ బృందాలు వెల్లడించారు.. సికింద్రాబాద్, కంచన్బాగ్ డీఆర్‌డీఓ, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ, గోల్కొండలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా.. మాక్ డ్రిల్ నిర్వహించినంత మాత్రనా.. ఈ యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాలపై ఉంటుందని చెప్పలేం! ఎందుకంటే.. ఈ ప్రాంతాలు పాకిస్థాన్ బార్డర్‌కి వేల లోపల ఉంది