The story of the YS Reddy Commission is shocking.. it will take days to figure out.
ఈడీకి చిక్కిన మరో మేతగాడు.. వైఎస్ రెడ్డి కమీషన్ కహానీ చూస్తే షాకే.. లెక్కకే రోజులు పడుతుందంట..
మొన్నటికి మొన్న హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్‌లాల్ కమీషన్ కహానీ మరువకముందే ఇప్పుడు ఇంకో ఘనుడు ఈడీకి చిక్కాడు. ఇక ఆయనగారి కమీషన్ కథా చిత్రాన్ని చూసి ఈడీ అధికారులే షేక్ అవుతున్నారు. ఆయన నివాసాల్లో దొరికిన సొమ్మును చూసి బ్యాంకుల్లో ఏమైనా సోదాలు చేస్తున్నామా అని అవాక్కవుతున్నారు. అంతలా పోగేశాడు ఆ అవినీతి అనకొండ.
మేతగాళ్లు మోపయ్యారు..! ప్రభుత్వం ఇచ్చే లక్షలకు లక్షల జీతాలు చాలవన్నట్లు… అక్రమంగా కోట్లు కొల్లగొడుతూ సమాజానికి విషపురుగుల్లా తయారవుతున్నారు..! అందినకాడికి గుటకాయ స్వాహా అంటూ గుట్టలకొద్దీ సొమ్ము పోగేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్‌లాల్ కమీషన్ కహానీ మరువకముందే ఇప్పుడు ఇంకో ఘనుడు ఈడీకి చిక్కాడు. ఇక ఆయనగారి కమీషన్ కథా చిత్రాన్ని చూసి ఈడీ అధికారులే షేక్ అవుతున్నారు. ఆయన నివాసాల్లో దొరికిన సొమ్మును చూసి బ్యాంకుల్లో ఏమైనా సోదాలు చేస్తున్నామా అని అవాక్కవుతున్నారు. అంతలా పోగేశాడు ఆ అవినీతి అనకొండ.
పేరు వైఎస్ రెడ్డి. ముంబై టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు వెలగబెడుతున్నాడు. పని మీద ఆసక్తి తక్కువ… కమీషన్ మీదే ఫోకస్ ఎక్కువ…! చెయ్యి తడిస్తేనే.. ఫైల్ కదులుతుంది..! మరి ఈయనగారి చెయ్యి అట్లాంటి ఇట్లాంటి చెయ్యి కాదు వెరీ కాస్టీ చెయ్యి. దీంతో పని జరగాలంటే కాస్ట్‌లీగానే సమర్పించుకోవాలి. లక్షల్లో కమీషన్లు చెల్లించాలి. వీలైతే విల్లాలు ఇచ్చుకోవాలి. ఫారిన్ ట్రిప్పులకు పంపించాలి. పని మరీ పెద్దదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు బంగారం బిస్కెట్లు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది.
అవినీతికి ఆకలెక్కువ అని విన్నాం కానీ.. ఈ రేంజ్ ఆకలి ఉంటుందని మాత్రం ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డిని చూస్తేనే అర్ధమవుతుంది..! కోట్లల్లో డబ్బు, డైమండ్లు, బంగారాన్ని చూస్తుంటే ఈడీ అధికారులే షేక్ అవుతున్నారు. వైఎస్ రెడ్డి పని మీద కంటే … కమీషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చెయ్యి తడిస్తేనే.. ఫైల్ ముందుకు పంపాడు. మరి ఈయనగారి చెయ్యి అట్లాంటి ఇట్లాంటి చెయ్యి కాదు వెరీ కాస్టీ చెయ్యి. దీంతో పని జరగాలంటే కాస్ట్‌లీగానే సమర్పించుకోవాలి. లక్షల్లో కమీషన్లు చెల్లించాలి. వీలైతే విల్లాలు ఇచ్చుకోవాలి. ఫారిన్ ట్రిప్పులకు పంపించాలి. పని మరీ పెద్దదైతే బంగారం బిస్కెట్లు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది.
వైఎస్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా..! లేక బ్యాంకులు కొల్లగొడుతున్నాడా అన్న డౌట్ వస్తోంది ఇతగాడి కమీషన్ కహానీ చూసి. ఈడీ అధికారులు హైదరాబాద్ సహా 12 చోట్ల సోదాలు చేస్తే.. లెక్కపెట్టడానికే రోజులు పట్టేంత సొమ్ము బయటపడింది. ప్రస్తుతానికి 23 కోట్ల విలువైన డైమండ్స్, 9 కోట్లకు పైగా నగదు, 8 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి… మరా సోదాలు ముగిస్తే కాలిక్యులేటర్‌లో పట్టనంత సొమ్ము దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.మొత్తంగా.. వైఎస్‌రెడ్డి అవినీతి లీల ఇప్పుడు యావత్ సివిల్ సర్వెంట్లకే మచ్చ తెస్తోంది.