coconut

How to use coconut shells that have a lot of water

నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాల్నే ఎలా తీసుకోవాలి, 3 టిప్స్‌తో ఎన్ని బోండాలున్నా నీరు ఎక్కువగా ఉన్న బోండాల్నే తీసుకోవచ్చు.

coconut

కొబ్బరిబోండాల్ని ఒకే దగ్గర తీసుకున్నప్పటికీ ఓ దాంట్లో నీరు ఎక్కువగా ఉంటే, మరో దాంట్లో నీరు తక్కువగా ఉంటుంది.అసలు నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాల్ని ఎలా ఎంచుకోవాలి.

మండే ఎండల్లో కొబ్బరినీరు తాగితే బాడీకి చల్లదనమే కాకుండా, తాజాగా అనిపిస్తుంది. కొబ్బరినీరు బాడీని హైడ్రేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ లోపాన్ని భర్తి చేసి స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేస్తుంది. మండే ఎండల్లో బాడీలోని నీరంతా బయటికి వెళ్తుంది. కాబట్టే, ఎక్స్‌ట్రాగా నీరు తాగమని చెబుతారు. అందుకోసం నీరు మాత్రమే కాకుండా చాలా మంది ఇలా కొబ్బరినీరు కూడా తాగుతారు. అయితే, నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాల్ని ఎలా ఎంచుకోవాలో చాలా మందికి తెలియదు.

కొబ్బరినీరు

ఎండాకాలంలో కొబ్బరినీరు తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. కొంతమందైతే సీజన్‌తో సంబంధం లేకుండా కొబ్బరినీరు తాగుతారు. దీని వల్ల చాలానే లాభాలు ఉంటాయి. అయితే, కొబ్బరిబోండాలు చూడ్డానికి బయట అన్నీ ఒకేలా కనిపించినప్పటికీ నీరు ఓ దాంట్లో ఎక్కువగా నీరు, మరో దాంట్లో తక్కు నీరు ఉంటుంది. అదే విధంగా, బయటికి తాజాగా కనిపించే కొబ్బరిబోండాల్ని కట్ చేయగానే లోపల ఎండిపోయినట్లుగా గుజ్జులా ఉంటుంది. అలా కాకుండా నీరు ఎక్కువగా ఉండే బోండాల్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

పచ్చిగా ఉండే

పైకి పచ్చిగా కనిపించే బోండాల్ని తాజా కొబ్బరిబోండాలని చెప్పొచ్చు. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, కొబ్బరికాయలపై గోధుమ రంగు గుర్తులు కనిపిస్తే తీసుకోకపోవడమే మంచిది. గోధుమరంగు కొబ్బరికాయలు పూర్తిగా పండి ఎండిపోతున్నట్లుగా గుర్తించాలి. ఇందులో నీరు తక్కువగా కొబ్బరి ఎక్కువగా ఉంటుంది.

గుండ్రంగా ఉండే బోండాలు

సాధారణంగా కొబ్బరిబోండాలు గుండ్రంగా, పొడుగ్గా ఉంటాయి. అయితే, గుండ్రంగా ఉండే కొబ్బరిబోండాల్లో ఎక్కువగా నీరు ఉంటుంది. ఎందుకంటే, అవి లోపల కాస్తా పచ్చిగానే ఉంటాయి. ఇలాంటివాటిలో కొబ్బరి తక్కువగా నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని తీసుకోవచ్చు. అయితే, కొద్దిగా పెద్దగా ఉన్న బోండాం తీసుకుంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుందనుకుంటారు. కానీ, అలా ఏం కాదు, మీడియం సైజ్‌వి తీసుకోండి.

వాసన చూసి, ఊపి చూడడం

కొబ్బరిబోండాలు తీసుకునేటప్పుడు మొదటగా చెవి దగ్గర పెట్టి ఊపి చూడండి. నీరు ఎక్కువగా ఉంటే నీటి శబ్ధం రాదు. కొబ్బరినీరు ఎక్కువగా ఉన్నట్లు, అదే నీరు తక్కువగా ఉంటే నీటి శబ్ధం వస్తుంది. అదే విధంగా, కొబ్బరిబోండాం వాసన చూడండి. తాజా వాసన వస్తే వాటిని తీసుకోండి. చెడు వాసన వస్తే వాటిని తీసుకోవద్దు.

మచ్చలు లేకుండా

అదే విధంగా, కొబ్బరిబోండాలపై మచ్చలు లేకుండా చూసి వాటిని తీసుకోవాలి. తాజా కొబ్బరిబోండాలు శుభ్రంగా ఉంటాయి. వాటిపై ఎలాంటి మచ్చలు, గుర్తులు ఉండవు. మచ్చలు ఎక్కువగా ఉంటే కొబ్బరికాయలు పాతవని చెప్పొచ్చు.

ఈ మూడు విషయాలని గమనిస్తే ప్రతిసారి కూడా నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాల్నే తీసుకోవచ్చు.

​గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.​​​​​

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.