Is this the color of the water bottle lid? Do you know which color lid is best for drinking?
వామ్మో.. వాటర్ బాటిల్ మూత రంగు ఇదేనా? ఏ రంగు మూత తాగితే బాగుంటుందో తెలుసా?
మంచి ఎండలో బయటకు వెళ్లమనుకోండి. విపరీతంగా దాహం వేస్తుంది కదా.. వెంటనే వాటర్ బాటిల్ కొని తాగేస్తాం. కానీ బాటిల్ మూత ఏ కలర్ లో ఉందో గమనించండి. కానీ బాటిల్ మూత కలర్ మీరు ఎలాంటి నీరు తాగుతున్నారో చెబుతుంది.
వాటర్ బాటిల్ మూత ఏ కలర్ ను బట్టి ఆ నీరు ఎంత నాణ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడున్న సమాచారం చదివితే వాటర్ బాటిల్ మూతలో ఇంత విషయం ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. దాహం వేస్తే వాటర్ బాటిల్ కొన్నామా? మూత ఓపెన్ చేశామా? తాగమా? బాటిల్ ఖాళీ అయ్యాక పాడేశామా? అంత వరకే మనమందరం ఆలోచిస్తాం. కానీ వాటర్ శుద్ధి చేసే కంపెనీలు వాటర్ బాటిల్ మూతల ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నీలం రంగు
సాధారణంగా చాలా వాటర్ బాటిల్ మూతలు నీలం రంగులోనే ఉంటాయి. ఎక్కువ కంపెనీలు కూడా నీలం రంగు మూతలు బిగించి వాటర్ బాటిల్స్ అమ్ముతాయి. దీనర్థం ఏంటంటే.. అవి సహజ నీటి వనరుల నుండి తయారు చేసిన నీరు. అంటే అందులో ఖనిజాలు, లవణాలు ఉంటాయి. అందుకే దాన్ని మినరల్ వాటర్ అంటారు.
ఆకుపచ్చ రంగు
చాలా అరుదగా ఆకుపచ్చ రంగు ఉన్న మూతలతో వాటర్ బాటిల్స్ కనిపిస్తాయి. ఇవి సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి హైఫై ప్లేసెస్ లో మాత్రమే కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు మూత అంటే ఆ నీరు ఫ్లేవర్డ్ వాటర్ అని అర్థం. ఆ నీరు తాగేటప్పుడు టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
తెలుపు రంగు
వైట్ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి చిన్న షాప్ లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కొనే నీళ్ల బాటిల్ మూత తెలుపు రంగులో ఉంటే దానర్థం ఏంటంటే.. ఆ నీరు శుద్ధి చేసిన నీరు. జస్ట్ ఫ్యూరిఫై చేసి అమ్ముతున్నారన్న మాట.
నలుపు రంగు
బ్లాక్ క్యాప్ మూతలున్న వాటర్ బాటిల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని సెలబ్రిటీలు, కోటీశ్వరులు, బడా వ్యాపారవేత్తలు కొనుక్కొని తాగుతారు. అంటే బ్లాక్ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్స్ లో నీరు అంత ఖరీదైందన్న మాట. వాటర్ బాటిల్ మూతలు నలుపు రంగులో ఉంటే అది ఆల్కలైన్ కలిపిన నీరు. ఈ నీరు తాగితే శరీరంలోని ఎసిడిటీ ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇది శరీరానికి చాలా మంచిది.