Vada

Many people don't know why there is a hole in the middle of the fritter, you know?

వడ మధ్యలో రంధ్రం ఎందుకుంటుందో చాలా మందికి తెలియదు, మీకు తెలుసా?

Vada

చాలా చోట్ల మినప వడలు చేసుకుని తింటారు. ఇంకొన్ని చోట్ల అలసంద వడలు వండుకుని తింటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందని? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో, దాని వెనుక కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.

చాలా మంది ఇళ్లల్లో బ్రేక్‌ఫాస్ట్ సర్వసాధారణం. చాలా ఇళ్లల్లో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి టిఫెన్స్ రెగ్యులర్‌గా చేసుకుంటారు. అయితే, ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలనిపిస్తే వడలు, పూరీలు చేసుకుంటారు. చాలా మందికి వడ అంటే ఫేవరేట్. చట్నీ, సాంబార్‌లో వడను తింటే నెక్స్ట్ లెవల్. ఇంకొందరు చికెన్, మటన్ కర్రీల్లో వడ కాంబినేషన్‌ను ఆస్వాదిస్తారు. పండగల సమయంలో కచ్చితంగా వడలు వండుకుని తినాల్సిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వడకు ఉన్న డిమాండ్ వేరు. చాలా చోట్ల మినప వడలు చేసుకుని తింటారు. ఇంకొన్ని చోట్ల అలసంద వడలు వండుకుని తింటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందని? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో, దాని వెనుక కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.

వంట టెక్నిక్

వడ మధ్యలో రంధ్రం చేయడం ద్వారా, దాని యొక్క ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణం నిష్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా వడ లోపలి నుంచి బాగా ఉడికిపోతుంది. వడ మిగతా వాటి కంటే మందంగా ఉంటుంది. దీంతో మధ్యలో రంధ్రం లేకపోతే అవి గట్టిపడతాయి. అంతేకాకుండా బాగా ఉడకవు. అందుకే లోపలి భాగాన్ని సరిగ్గా కాల్చడానికి మధ్యలో రంధ్రం చేస్తారు.వడలో రంధ్రాలు చేయకపోతే అది సరిగ్గా ఉడకదు. మధ్య భాగం ఉడకకుండానే ఉంటుంది. దీంతో, అది తిన్నప్పుడు పిండి పిండిగా ఉంటుంది.

ఉబ్బకుండా

వడలో రంధ్రాలు చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అది బాగా ఉబ్బకుండా నిరోధించడానికి మధ్యలో రంధ్రం పెడతారు. వడ మధ్యలో రంధ్రం చేయకపోతే అది బాగా ఉబ్బుతుంది. ఇది వడ మృదుత్వం, రుచి రెండింటీని ప్రభావితం చేస్తుంది. అందుకే వడ ఉబ్బకుండా ఉండటానికి మధ్యలో ఒక రంధ్రం చేస్తారు.

కాగే నూనె నుంచి ఈజీగా తీయడానికి

వడ వండటానికి నూనెను బాగా మరిగిస్తారు. అలా కాగే నూనె నుంచి వడ తీయాలేంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నూనె చుక్కలు చర్మంపై పడి బొబ్బలు, మంట వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీనిని నివారించడానికి వడ మధ్యలో రంధ్రం పెడతారు. రంధ్రం ఉంటే కాగే నూనె నుంచి వడలు తీయడం చాలా సులభం. అందుకే పాత రోజుల నుంచి వడ మధ్యలో రంధ్రం పెడతారు. అందుకే చాలా చోట్ల మేదు వడ అంటారు. మేదు అంటే మృదువు అని అర్థం. వడ మృదువుగా రావడానికి దాని మధ్యలో రంధ్రం పెడతారు.

వడ మెత్తగా, క్రిస్పీగా రావడానికి చిట్కాలు

మినపప్పు బాగా నానబెట్టండి
వడ తయారీలో మొదటి, అతి ముఖ్యమైన దశ మినపప్పును నానబెట్టడం . పప్పును రాత్రంతా లేదా కనీసం 5-6 గంటలు నానబెట్టండి. పప్పు సరిగ్గా నానబెట్టకపోతే, వడలు గట్టిగా వస్తాయి. అంతేకాకుండా వడలు తినడానికి రుచిగా కూడా ఉండవు. అందుకే వడలు బాగా మెత్తగా రావాలంటే మినపప్పు బాగా నానబెట్టి.. ఆ తర్వాత పిండి రుబ్బుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా ఫాలో అవ్వండి

* చాలా మంది పిండి రుబ్బుకున్న తర్వాత బాగా కలపరు. దీంతో, వడలు టేస్ట్‌గా రావు. అందుకే పిండిని బాగా కలుపుకోవాలని గుర్తించుకోండి.

* పిండితో అప్పడప్పుడే వడలు వేసుకుంటే అవి గట్టిగా మారతాయి. అందుకే రుబ్బుకున్న తర్వాత పిండిని ఎక్కువ సేపు పక్కనపెట్టండి. ఆ తర్వాత వడలు వేసుకుంటే అవి మృదువుగా వస్తాయి.

* వడలు వేడి నూనెలో బాగా వేయించండి. అంతేకాకుండా రెండు వైపుల బాగా నూనెలో మగ్గేలా చూసుకోండి. అప్పుడైతేనే వడలు మృదువుగా, రుచిగా ఉంటాయి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.