Ration cards are available in 4 colors.. Do you know which color card has more benefits?!
Ration Card: రేషన్ కార్డులు 4 రంగులలో ఉంటాయి.. ఏ రంగు కార్డుకి ఎక్కువ ప్రయోజనాలు తెలుసా.!
Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు పేద, దిగువ మరియు మధ్యతరగతి వర్గాల కోసం అనేకరకాల పథకాలను అమలు చేసింది. భారత ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం కింద అర్హులైన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యంతో పాటు గోధుమ అలాగే చక్కెర ఇతర ముఖ్యమైన వస్తువులతో సహా ఆహార పదార్థాలను చౌక ధరలకే ప్రభుత్వం అందిస్తుంది. అయితే రేషన్ కార్డులు నాలుగు రకాలుగా ఉంటాయి.
రేషన్ కార్డు రంగును బట్టి వీటిని వర్గీకరిస్తారు. ఏ కలర్ రేషన్ కార్డుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో నాలుగు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆర్థిక తరగతులను ఈ నాలుగు రకాల రేషన్ కార్డులు నిర్దేశిస్తాయి. కేవలం ఆహార ధాన్యాల పంపిణీకి మాత్రమే కాకుండా సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను కూడా ఇవి నిర్దేశిస్తాయి. నాలుగు రకాల రేషన్ కార్డులు పసుపు, గులాబీ, నీలం మరియు తెలుపు రంగులో ఉంటాయి.
దారిద్రరేఖకు దిగువన ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఎల్లోరేషన్ కార్డును జారీ చేస్తుంది. వీరికి గోధుమలతో పాటు బియ్యం, పప్పులు మరియు చక్కెర వంటి ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యవసర వస్తువులు కిరోసిన్ వంటివి కూడా చాలా తక్కువ ధరకు అందిస్తారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక రకాల సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డు ప్రమాణికంగా పనిచేస్తుంది. అలాగే దారిద్ర రేఖ ఎగువన ఉన్న కుటుంబాలకు గులాబీ రంగు రేషన్ కార్డు అమలు చేస్తారు.
ఈ రేషన్ కార్డు ఉన్నవాళ్లు రేషన్ షాపుల నుంచి చౌక ధరలకు ధాన్యాలు పొందవచ్చు. నీలం లేదా నారింజ రంగు రేషన్ కార్డును ఆర్థికంగా వెనుకబడి బిపిఎల్ జాబితాలో లేని వారికి మంజూరు చేస్తారు. ఈ కార్డు ఉన్నవాళ్లు పప్పులు, చక్కెర, బియ్యం మరియు గోధుమలతో పాటు కిరోసిన్ వంటివి కూడా తక్కువ ధరకు తీసుకోవచ్చు. ఇక తెల్ల రేషన్ కార్డును ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలకు అందజేస్తారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి ధాన్య సహాయం. ఈ కార్డును కేవలం కొన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

