High interest rates in these banks.

High interest rates in these banks.

1 Year FD: ఏడాదికే చేతికి డబ్బులు.. ఈ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ రేట్లు.. 10 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

High interest rates in these banks.

IndusInd Bank FD Rates: ఇటీవల ఆర్బీఐ కీలక రెపో రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ.. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే తగ్గించినా కొన్ని మాత్రం కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపైనే తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏడాది వ్యవధి డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల గురించి చూద్దాం.

చాలా కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొద్ది రోజుల కిందట కీలక రెపో రేట్లు తగ్గించింది. 6.50 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. ఇదే సమయంలో బ్యాంకులు లెండింగ్ రేట్లను తగ్గించాల్సి వస్తోంది. అంటే హోం లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటి ఈఎంఐ తగ్గుతుంది. లేదా లోన్ టెన్యూర్ తగ్గుతుంది. అయితే.. ఇదే సమయంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇంత కాలం అత్యధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేయగా.. ఇప్పుడు క్రమంగా తగ్గిస్తూ వస్తుంటాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఇలా చేయగా.. ఇంకొన్ని బ్యాంకులు కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై చాలా బ్యాంకులు ఆకర్షణీయ స్థాయిలోనే వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.

లేటెస్ట్ బ్యాంక్ ఎఫ్‌డీ

ఇప్పుడు రూ. 3 కోట్లకు లోబడిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఏడాది టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అన్ని బ్యాంకుల్లోనూ జనరల్ సిటిజెన్స్ వడ్డీ రేట్లు చూద్దాం. వీరి కంటే సీనియర్ సిటిజెన్లకు దాదాపు ప్రతి బ్యాంకులో కూడా దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ అధికంగా వస్తుందని చెప్పొచ్చు.

బంధన్ బ్యాంకు ఏడాది ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 8.05 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక్కడ రూ. 10 లక్షలు జమ చేస్తే సంవత్సరంలో రూ. 80,277 వడ్డీ వస్తుంది. ఇండస్‌ఇండ్ బ్యాంకులో సంవత్సరం వ్యవధి డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ కూడా రూ. 10 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసినట్లయితే రూ. 77,287 వడ్డీ అందుతుంది. యెస్ బ్యాంకులో కూడా ఇదే స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. కాబట్టి రిటర్న్స్ ఇలాగే ఉంటాయని చెప్పొచ్చు.

ఆర్బీఎల్ బ్యాంకులో ఏడాది డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుతం 7.50 శాతంగా ఉంది. ఇక్కడ 10 లక్షలు జమ చేసిన వారికి మెచ్యూరిటీకి రూ. 74,793 వడ్డీ అందుతుంది. కర్ణాటక బ్యాంకులో ఏడాది టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. ఇక్కడ రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి చేతికి రూ. 72,305 వడ్డీ వస్తుంది. డీసీబీ బ్యాంకులో ఏడాది ఎఫ్‌డీపై 7.10 శాతం వడ్డీ రేటు ఉండగా 10 లక్షలు జమ చేసిన వారికి చేతికి రూ. 70,807 వడ్డీ అందుతుంది. సీనియర్ సిటిజెన్లకు ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పొచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.