12 month gold chitti scheme

 The secret behind the 12 month gold chitti scheme

 Gold Rate: 12 నెలల గోల్డ్ చిట్టి స్కీంలో వెనుక ఉన్న రహస్యం ఇదే..మంత్లీ గోల్డ్ స్కీంలో బంగారం కొంటే లాభమా నష్టమా..?

The secret behind the 12 month gold chitty scheme

Gold Monthly Installment Scheme: బంగారం ధర ప్రతిరోజు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది.

ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,000 సమీపానికి చేరింది. మరోవైపు 22 క్యారెట్లు ఆభరణాల బంగారం ధర సైతం 10 గ్రాములకు గాను 80 వేల రూపాయలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు గతంలో మాదిరిగా కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం పెరిగిన ధరలే అని చెప్పవచ్చు. అయితే బంగారు ఆభరణాలు సేల్స్ తగ్గకుండా ఉంచేందుకు బంగారు ఆభరణాల షాపుల యజమానులు వినూతమైన స్కీంలతో ముందుకు వస్తుంటారు ముఖ్యంగా చాలా మందికి తెలిసిన గోల్డ్ మంత్లీ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Gold Chit Scheme అంటే ఏమిటి? దీని పనితీరు ఎలా ఉంటుంది.

ఏక మొత్తంలో బంగారం కొనుగోలు చేయలేని వారు, ఈ గోల్డ్ మంత్లీ స్కీం ద్వారా ప్రతినెల వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. సాధారణంగా అవి 12 నెలల పాటు ఉంటాయి. నిర్నేత గడువు పూర్తయిన తర్వాత మీరు చెల్లించిన మొత్తం డబ్బుకు సమానమైన బంగారం ఆభరణాన్ని కొనుగోలు చేయవచ్చు. పెరుగుతున్న బంగారం రేటు ఆధారంగా ఈ గోల్డ్ మంత్లీ స్కీం అనేది మధ్యతరగతి వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏక మొత్తంలో లు చెల్లించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని వారికి ఈ మంత్లీ గోల్డ్ చిట్ స్కీం పనికి వస్తుంది. 

11 నెలలు చిట్టి కట్టి ఒక నెల ఉచితం వెనుక ఉన్న మతలబు ఇదే.

సాధారణంగా టీవీల్లోనూ అదే విధంగా న్యూస్ పేపర్లలో కొన్ని ప్రకటనలు చూస్తుంటాం. వీటిలో నగల దుకాణాల వాళ్ళు బంగారం చిట్టి పథకం గురించి చెబుతూ మీరు 11 నెలల పాటు చిట్టి డబ్బులు చెల్లించండి 12వ నెల దుకాణం యజమాని చెల్లిస్తాము ఒక నెల ఉచితం అంటూ ఊదరగొడతారు. ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. నిజానికి మీరు 11 నెలలకు చెల్లించిన 12 నెలల వాల్యూ మీకు లభిస్తుంది. అయితే మీకు ముందుగా ఎంత బంగారం ఇస్తాము అనేది హామీ ఉండదు. 11 నెలల తర్వాత ఆ రోజు బంగారం ధరను బేరీజు వేసుకొని మీరు ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే బంగారం దుకాణాల వారు ఆఫర్ చేసే 12వ నెల చిట్టీ మీ తరపున వారు కట్టి ఎందుకు నష్టపోతారు అనే అనుమానం మీకు కలగవచ్చు. దీని వెనుక కారణాలు తెలుసుకుందాం. 

మేకింగ్ చార్జెస్ రూపంలో కవర్ చేస్తారు.

బంగారం దుకాణం వారు నిజానికి మనకు 1 నెల ఉచిత ప్రయోజనం మనకు అందించడడం వెనుక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది. దీని వల్ల కస్టమర్లకు ప్రయోజనం లభిస్తుంది. అయితే కొన్ని షరుతులు కూడా ఉంటాయి. అయితే సాధారణంగా నగల దుకాణా దారులు వారు ఆఫర్ చేసిన స్కీములో మేకింగ్ చార్జెస్ అనేవి మినహాయింపు ఇవ్వరు. సాధారణంగా ఈ మేకింగ్ చార్జెస్ అనేవి 8 నుంచి 15 శాతం మధ్యలో ఉంటాయి.

ఏదైతే కస్టమర్ కు ఒక నెల బెనిఫిట్ అందిస్తున్నారు ఆ ప్రయోజనం బంగారం వ్యాపారి మేకింగ్ చార్జెస్ రూపంలో వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేస్తున్నారు అంటే దానిలో 10% మేకింగ్ చార్జి ఉంటుంది అంటే మీరు 10,000 అదనంగా చెల్లించాలి. ఇక్కడే షాపు వారు తమ మేకింగ్ చార్జీల రూపంలో ఒక నెల ఉచిత చిట్టి ఆఫర్ ద్వారా నష్టపోయింది రికవరీ చేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. 

మంత్లీ గోల్డ్ స్కీమ్ వల్ల లాభాలు ఇవే.

తక్కువ మొత్తంలో మీరు ప్రతి నెల బంగారం దుకాణాల వద్ద డబ్బును స్కీం లో దాచుకొని చివరకు మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే సాధారణంగా స్కీం కాకుండా రెగ్యులర్గా గోల్డ్ కొనుగోలు చేసినట్లయితే ఆభరణాలపై వేసే మేకింగ్ ఛార్జ్ కన్నా, స్కీం ద్వారా కొనుగోలు చేసిన ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉంటాయి. ఈ స్కీం వల్ల దుకాణదారులకు లాభం ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు 11 నెలల పాటు ముందుగానే డబ్బు చెల్లిస్తారు దానివల్ల దుకాణదారులకు లాభం ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు 11 నెలల పాటు ముందుగానే డబ్బు చెల్లిస్తారు దానివల్ల షాపు వారికి క్యాష్ ఫ్లో అనేది పెరుగుతుంది. ప్రతి సంవత్సరం బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ స్కీం చాలా ఉపయోగపడుతుంది.

మంత్లీ గోల్డ్ స్కీమ్ కట్టే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.

 ఈ స్కీమ్ లో రెగ్యులర్ గా డబ్బులు ప్రతి నెల చెల్లించాలి. ఒక నెల చెల్లించక పోయిన స్కీమ్ నుంచి తప్పకున్నట్లే అంతే కాదు మీకు డబ్బు కూడా తిరిగి రాదు.

 మీరు ఈ స్కీమ్ లో చేరే ముందే షరతులన్నీ పూర్తిగా చదవాలి ఇందులో కొన్ని షాపులు తయారీ చార్జీలు అదేవిధంగా పన్నులు అదనంగా వేసే అవకాశం ఉంటుంది కనుక ముందుగానే క్షుణ్ణంగా నిబంధనలన్నీ చదవాలి. 

ఈ స్కీములో రిఫండ్ అనేది ఉండదు. 

 మీరు ఎంత అత్యవసరంలో ఉన్నా మంత్లీ గోల్డ్ స్కీం లో కట్టిన డబ్బులు క్యాష్ రూపంలో వెనక్కి ఇవ్వడం జరగదు. మీరు దానిని బంగారం ఆభరణం రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆభరణంలోని బంగారంపై మాత్రమే ఈ స్కీం అందుబాటులో ఉంటుంది ఆభరణంలో వాడిన వజ్రాలు వజ్రాలు ఇతర రత్నాలకు అదనంగా చెల్లించాల్సి. 

 ఈ గోల్డ్ స్కీం చిట్టిని ముందుగా క్లోజ్ చేయడం అనేది దాదాపుగా కుదరదు. 

 కొన్నిసార్లు ఎంపిక చేసిన డిజైన్ల పైన మాత్రమే ఈ చిట్టి ద్వారా నగలు కొనేందుకు అనుమతిస్తారు. తద్వారా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని డిజైన్లను కొనాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన షాపును బట్టి మారుతూ ఉంటుంది.

మంత్లీ గోల్డ్ స్కీం కాకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యామ్నాయం మరొకటి ఉందా: 

ఒకవేళ మీరు బంగారం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న లాభాలను పూర్తిగా పొందాలి అనుకున్నట్లయితే Gold ETF, Gold FD, Digital Gold స్కీముల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.