TG TET Result 2025
టీజీ టెట్ ఫలితాలు విడుదల..
TG TET Results 2025 : తెలంగాణ టెట్ రిజల్ట్ విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా బుధవారం (ఫిబ్రవరి 5) విడుదల చేశారు. తొలుత టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డొస్తుందని భావించినప్పటికీ.. ఇప్పటికే ఎగ్జామ్ పూర్తయినందున ఎలాంటి అడ్డంకులు లేవని భావించిన విద్యాశాఖ బుధవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
>>>>TG TET Result 2025 Click Here
జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్ లో జరిగిన టెట్ పరీక్షల్లో 1,35,82 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అంటే టెట్ ఫలితాల్లో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఫలితాల ప్రకటనలో వెల్లడించారు. పేపర్ -1 లో 69, 476 మంది పరీక్ష రాస్తే 41 ,327 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 69,390 మంది పరీక్ష రాస్తే 23,755 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్ లో 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 1 అండ్ 2 లో కలిపి 1,35,802 మంది పరీక్షలు రాస్తే 42,384 మంది ఉత్తీర్ణత సాధించారు.
Important Link:
>>>>TG TET Result 2025 Click Here