Why do shirts have pockets on the left side? Do you know the reasons behind this?
చొక్కాలకు జేబు ఎడమవైపే ఎందుకుంటుంది? దీని వెనుక కారణాలేంటో తెలుసా?
ఫ్యాషన్ వరల్డ్‌లో షర్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే, విభిన్నమైన డిజైన్ షర్ట్స్‌కు ఒక కామన్ విషయం ఉంది. అదే షర్ట్ పాకెట్. చొక్కాలకు జేబు ఎడమ వైపు ఉంటుంది. అసలు అలా ఎందుకు డిజైన్ చేశారు. కారణాలపై ఓ లుక్కేద్దాం.
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైనర్ల అద్బుత డిజైన్ ఎవరికీ అంతు చిక్కదు. ఈ డ్రెస్ ఎందుకు ఇలా చేశారు, ఆ డ్రెస్ డిజైన్ ఏంటి అలా ఉంది అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక, చాలా మంది షర్ట్స్ లేదా చొక్కాలు ఎక్కువగా ధరిస్తారు. పురుషులే కాదు మహిళలు కూడా షర్ట్స్‌ని ధరిస్తారు. ఇక, రకరకాల షర్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ వరల్డ్‌లో షర్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే, విభిన్నమైన డిజైన్ షర్ట్స్‌కు ఒక కామన్ విషయం ఉంది. అదే షర్ట్ పాకెట్. చొక్కాలకు జేబు ఎడమ వైపు ఉంటుంది. అసలు అలా ఎందుకు డిజైన్ చేశారు. కారణాలపై ఓ లుక్కేద్దాం.
ప్రారంభంలో జేబులు లేవు
చరిత్ర ప్రకారం ప్రారంభంలో షర్ట్స్‌కి పాకెట్స్ లేవు. అయితే, రాను రాను చొక్కాలకు జేబులు పెట్టారు. అయితే, చొక్కాలకు జేబులు.. ఫ్యాషన్ కోసం కాదు.. కేవలం సౌలభ్యం కోసం సృష్టించబడ్డాయి. పెన్ను, చిన్న డైరీ, మనీ లాంటి వస్తువులను చేతిలో పెట్టుకోవడం చాలా ఇబ్బందితో కూడుకుంది. అందుకే అందుకే కాలక్రమేణా షర్టుల్లో పాకెట్స్ వేసుకునే ట్రెండ్ మొదలైంది. అయితే, షర్ట్ పాకెట్ స్థానంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. కేవలం ఎడమవైపే జేబులు ఎందుకున్నాయి?
జేబు ఎడమవైపు ఎందుకు ఉంది?
చొక్కా జేబు ఎప్పుడూ ఎడమవైపు ఎందుకు ఉంటుంది? ఇది మనలో చాలా మందికి తలెత్తే ప్రశ్న. చాలా షర్టుల జేబులు ఎడమ వైపున ఉండటాన్ని మనం గమనించవచ్చు. అసలు కుడి వైపున కాకుండా లెఫ్ట్ సైడ్ జేబును ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.
కంఫర్ట్ కోసం
చొక్కా పాకెట్స్ చాలా వరకు ఎడమ వైపున ఉంటాయి. దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ కారణం లేదు. కంఫర్ట్‌ని దృష్టిలో పెట్టుకుని ఎడమవైపు జేబును పెట్టారు . చాలామంది వ్యక్తులకు ఎడమ వైపు పాకెట్ నుంచి వస్తువుల్ని తీయడం చాలా సులభం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కుడిచేతి వాటం కలిగి ఉంటారు. కుడి చేతిని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులకు, ఎడమ వైపున జేబును కలిగి ఉండటం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఫ్యాషన్‌లో చాలా మార్పులు
రోజులు గడిచే కొద్దీ ఫ్యాషన్‌లో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో పురుషుల చొక్కాలకు మాత్రమే జేబులు ఉండేవి. అది కూడా ఎడమ వైపు మాత్రమే. స్త్రీల షర్ట్స్‌కి పాకెట్స్ లేవు. అయితే, కాలం మారుతున్న కొద్దీ, మహిళల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని షర్ట్స్ డిజైన్‌లో మార్పులు చేశారు. స్త్రీల చొక్కాలకు కూడా పాకెట్స్ పెట్టడం ప్రారంభించారు. అది కూడా ఎడమ వైపు. కారణం చాలా మంది మహిళలు కూడా కుడి చేతి వాటం వారే.
చొక్కాకి రెండు వైపులా పాకెట్స్
క్రమంగా ఇది విస్తృతమైన ధోరణిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు చొక్కా యొక్క ఎడమ వైపున పాకెట్స్ తయారు చేయడం ప్రారంభించారు. అయితే, ఫ్యాషన్లు మారడం ప్రారంభించడంతో, కొన్ని షర్టులకు కుడి వైపున లేదా రెండు వైపులా కూడా పాకెట్స్ డిజైన్ చేశారు. ఫ్యాషన్ కోణం నుంచి ఎడమ వైపున పాకెట్ ఉండటం వల్ల చొక్కా మరింత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అందుకే ఇది ఒక ట్రెండ్‌గా మారింది. ఇలా షర్టుల్లో లెఫ్ట్ సైడ్ పాకెట్ వాడకం మొదలైంది, అది ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైంది.
గమనిక:ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం.