Expansion of Hyderabad HMDA

Expansion of Hyderabad HMDA

హైదరాబాద్ HMDA విస్తరణ.. RRR దాటనున్న పరిధి, కొత్తగా చేర్చే మండలాలు ఇవే..!

Expansion of Hyderabad HMDA

హైదరాబాద్ హెచ్‌ఏండీఏ పరిధిని మరింత విస్తరించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం హెచ్‌ఏండీఏ పరిధిలో 74 మండలాలు ఉండగా.. కొత్తగా మరో 32 మండలాలను కూడా చేర్చేందుకు సిద్ధమైంది. రీజినల్ రింగు రోడ్డు ఆవల 5 కి.మీ మేర పరిధిని విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలోనే కేబినెట్‌లో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా దాదాపు 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరంతో రీజినల్ రింగు రోడ్డును నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌ అని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోడ్డు పూర్తియితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

ఇక హైదరాబాద్ మహా నగర విస్తరణపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం హెచ్‌ఎండీఏ (Hyderabad Metropolitan Development Authority) పరిధిని కూడా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 13 వేల చదరపు కి.మీ పెంచాలని సర్కార్ యోచిస్తోంది. ఆర్ఆర్ఆర్ ఆవల 5 కి.మీ పరిధి వరకు విస్తరించాలని ఫ్లాన్ చేస్తోంది. హెచ్‌ఎండీఏలోకి కొత్తగా 32 మండలాలు, పలు గ్రామాలను చేర్చాలనుకుంటుంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని పలు మండలాలు ఉండేవి. జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్తగా.. యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు కలిసాయి. మెుత్తం 74 మండలాలు, 1,000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38 మున్సిపాలిటీలకు హెచ్‌ఎండీఏ పరిధి పెరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏను మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్తగా 32 మండలాలను కలిపేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం 74 మండలాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ 106 మండలాలకు చేరనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలోనే బోర్డు, మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రాగా.. హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ఆయా జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్ మరింత పుంజుకోనుంది.

కొత్తగా చేర్చే ప్రతిపాదితమండలాలు

రంగారెడ్డి జిల్లాలో మాడుగుల, కడ్తాల్‌‌, తలకొండపల్లి, ఆమనగల్, కేశంపేట

యాదాద్రి జిల్లాలోని రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, సంస్థాన్‌‌ నారాయణపురం, వలిగొండ

నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ, నాంపల్లి, చండూరు, మునుగోడు, చింతపల్లి మండలాల్లో కొన్ని గ్రామాలు

నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాలు

మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా రాజాపూర్‌‌, నవాబ్‌‌పేట, బాలానగర్‌‌ మండలాల్లోని మరికొన్ని గ్రామాలు

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌‌పూర్‌‌, గజ్వేల్‌‌, రాయపోల్‌‌

మెదక్‌‌ జిల్లాలోని మాసాయిపేట

సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌‌, సదాశివపేట, చౌటకూర్‌‌

వికారాబాద్‌‌ జిల్లాలోని నవాబ్‌‌పేట, పరిగి, వికారాబాద్‌‌, మోమిన్‌‌పేట, పూడూరు మండలాల్లోని కొన్ని గ్రామాలు

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.