What to eat to reduce uric acid levels

What to eat to reduce uric acid levels

బాడీలోని యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గేందుకు ఏం తినాలి, ఏం తినకూడదు, లిస్ట్ ఇదే..

What to eat to reduce uric acid levels

ఏ సమస్య అయినా మనం తీసుకునే ఫుడ్‌తోనే పెరుగుతుంది. తగ్గుతుంది. అందుకే, సమస్యని తగ్గించేందుకు సరైన ఫుడ్స్ తీసుకోవాలి. అలానే యూరిక్ యాసిడ్ కూడా.

మనం సాధారణంగా తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్‌గా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుందని, కానీ, కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ ఎక్కువగా విడుదలై మూత్రం ద్వారా వెళ్లనప్పుడే సమస్య వస్తుంది. బయటికి వెళ్లని యూరిక్ యాసిడ్ రక్తంలోకి వెళ్తుంది. ఇలా రక్తంలోకి చేరిన యూరిక్ యాసిడ్ స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి హైపర్ యూరిసిమియాకి దారి తీస్తుంది. అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం అంత మంచిది కాదు. అందుకే, దీనిని తగ్గించుకోవాలి. దీనికోసం ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి.

యూరిక్ యాసిడ్ పెరిగితే

బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే అది కిడ్నీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మూత్ర విసర్జనలో సమస్యలు ఏర్పడి హైబీపి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య పెరిగి నడవడానికి కూడా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తాయి. రక్తంలో యూరిక్ ఆమ్లం పెరిగితే హైపర్ యూరిసిమియాగా మారుతుంది. దీంతో మన కాలి బొటనవేలు దగ్గర యూరిక్ యాసిడ్స్ పేరుకుపోయి కాలి వేలు వస్తుంది. దీనినే గౌట్ అంటారు. ఇది ముదరితే గౌట్ ఆర్థరైటిస్‌గా మారుతుంది. దీంతో ఆ ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే, ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తగ్గించాలి. ఇవే కాకుండా, గౌట్‌ని తగ్గించే ఆహార పదార్థాలు కొన్ని ఆహారాల్లో ఉంటాయి. అలానే సమస్యని పెంచే ఫుడ్స్ కూడా ఉంటాయి. వీటి గురించి సమస్య ఉన్నవారు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోకూడని ఫుడ్స్

రెడ్ మీట్

సీ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్స్

బఠానీలు

బచ్చలికూర

పల్లీలు

ఎండుద్రాక్ష

కూల్ డ్రింక్స్

ఆల్కహాల్

షుగర్ ఫుడ్స్

బేవరేజెస

యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఏం తినాలి

విటమిన్ సి ఫుడ్స్

సీజనల్ ఫ్రూట్స్

పాలకూర

పాలు, డెయిరీ ప్రోడక్ట్స్

అన్ని రకాల బెర్రీస్

రేగిపండ్లు

నేరేడు పండ్లు

చెర్రీస్

ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్

మీల్ మేకర్, సోయా ప్రోడక్ట్స్

గ్రీన్ టీ

బార్లీ నీరు

ఎక్కువగా నీరు

కాఫీ

బ్లాక్ కాఫీ

తగ్గేందుకు ఏం చేయాలి

హెల్దీ వెయిట్ ఉండేలా చూసుకోండి. మంచి డైట్ ఫాలో అవ్వండి.ప్యూరిన్ ఫుడ్స్ తీసుకోవద్దుహెల్దీ ఫుడ్స్ కూడా మితంగానే తీసుకోవాలి.

బరువు తగ్గడం

బరువు ఎక్కువగా ఉంటే గౌట్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, బరువు తగ్గండి. కేలరీలని తగ్గించండి. బరువు తగ్గితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో కీళ్లపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగాలి. ఎంత హైడ్రేట్‌గా ఉంటే అంత మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. లోఫ్యాట్ మిల్క్, పప్పుల వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.