Style Smart Watches

Style Smart Watches

స్టైల్‌గా స్మార్ట్ వాచ్‌లను వాడుతున్నారా. అయితే ముందు ఈ విషయం గురించి తెలుసుకుందాం.

Style Smart Watches

ఈమధ్యకాలంలో చాలామంది స్మార్ట్ వాచ్‌లు పెట్టుకోవడం సర్వసాధారణమైపోయింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మరికొందరు స్మార్ట్ వాచ్ ధరిస్తారు. ఈ వాచీలు ఎండ, దుమ్ము, వానలను తట్టుకుని ఉంటాయి.

అలాగే చూడటానికి ఆకర్షనియంగా కూడా ఉంటాయని అనుకుంటే పొరపాటు. వాటితో మన శరీరంలోకి హనీకరమైన బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఫిట్‌నెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ ఫిట్‌నెస్ ట్రాకర్లకు సంబంధించిన బ్యాండ్‌లలో చర్మానికి హనీ కలిగించే హానికరమైన రసాయనం PFHxA(పర్‌ఫ్లోరోహెక్సనోయిక్ యాసిడ్) గణనీయమైన మోతాదులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నోత్రేడమే ఆధ్వర్యంలో పలువురు శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. వీరు ప్రముఖ స్మార్ట్ వాచ్‌ల బ్రాండ్‌లకు చెందిన 22 బ్యాండ్‌లపై వివరణాత్మక అధ్యయనం చేయగా.. అవి చెమట, జిడ్డును నిరోధించడానికి రూపొందించిన సింథటిక్ రబ్బర్‌ను వినియోగిస్తున్నట్టు తేలింది. ఇక వాటిల్లో గణనీయమైన స్థాయిలో PFHxA ఉందని గుర్తించారు. ఈ రసాయనం సులభంగా చర్మంలోకి ఇంకిపోతుందని.. తద్వారా పలు చర్మ సమస్యలు ఏర్పడవచ్చునని అన్నారు. ప్రత్యేకించి దాదాపు 21 శాతం మంది అమెరికన్లు స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ ట్రాకర్‌లను రోజుకు 11 గంటల కంటే ఎక్కువసేపు ధరిస్తుంటారని చెప్పుకొచ్చారు.

అసలు ఈ PFHxA(పర్‌ఫ్లోరోహెక్సనోయిక్ యాసిడ్) అంటే ఏంటి.?

PFHxA అనేది PFAS(పాలీఫ్లోరోఅల్కైల్ సబ్‌స్టన్స్) అని పిలువబడే సింథటిక్ రసాయనాల సమ్మేళనాలలోని ఒక భాగం. ఈ రసాయనం అటు పర్యావరణం, ఇటు మానవ శరీరంలో ఎక్కువ కాలం ఉండగల సామర్థ్యం కలిగినది. నాన్-స్టిక్ కుక్‌వేర్, ఫుడ్ ప్యాకేజింగ్, కాస్మెటిక్స్ వంటి వస్తువులలో PFAS ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు చర్మంపై నేరుగా ధరించే వాచ్ బ్యాండ్‌లలో వాటి ఉనికిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సుమారు 13 ప్రసిద్ది చెందిన స్మార్ట్ వాచ్ బ్యాండ్‌లపై ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ శాతం.. అలాగే ఫ్లోరోఎలాస్టోమర్‌లుగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

స్మార్ట్‌వాచ్‌లతో ఆరోగ్య సమస్యలు.

30 డాలర్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ వాచ్ బ్యాండ్‌లలో అధిక స్థాయి ఫ్లోరిన్ ఉందని అధ్యయనంలో గుర్తించారు. PFHxA సాంద్రతలు 1,000 పార్ట్స్ పర్ బిలియన్(ppb) కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది మిగిలిన వినియోగదారు ఉత్పత్తుల కంటే చాలా ఎక్కువని స్పష్టమైంది. అటు 15 డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ వాచ్ బ్యాండ్‌లలో ఈ రసాయనం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అటు కొన్ని బ్యాండ్‌లు అయితే 16,000 ppbని కూడా అధిగమించాయని తెలిపారు. ఈ PFHxA కాలేయం, బ్లడ్, ఎండోక్రైన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా,యూరోప్‌లోని శాస్త్రవేత్తలు ఈ PFHxA రసాయనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.